హైదరాబాద్

సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని నూతనంగా జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పాల్మాకుల జంగయ్య విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుస్తకాల నర్సింగ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాకు వరప్రదాయని అని చెబుతున్న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడక సాగుతున్నాయని అన్నారు. జిల్లాలో సాగు, తాగు నీటికి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. జిల్లాలో రైతుల కష్టాలు వర్ణించలేని విధంగా ఉన్నాయని అన్నారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో సాగు నీటి వసతి, రుణాల మంజూరులో జాప్యం, నాణ్యమైన విత్తనాలు అందక రైతులు నరకయాతన అనుభవిస్తున్నారని వాపోయారు. ఇన్ని కష్టలు ఎదుర్కొని పంటలు పండిస్తే గిట్టుబాటు ధర అందక, అన్నదాతలు అడ్డా కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు పూర్తగగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. జేఏసీ ఇస్తున్న పిలుపు మేరకు ప్రతి రోజు తమ కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం కలిసి వచ్చే వారందరి సహకారంతో పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు.