హైదరాబాద్

ఆదాయ అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని కోటిన్నర మంది జనాభాకు ముఖ్యమైన సేవలను అందిస్తూ, అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాల్సిన బల్దియా ఇపుడు వన్‌పాయింట్ ప్రొగ్రాంలోనే నిమగ్నమైంది. ఇప్పటికే ఆస్తిపన్ను, స్వచ్ఛ ఉల్లంఘనలు వంటివి రోజువారీ టార్గెట్ల ప్రకారం వసూళ్లలో బిజీగా ఉన్న బల్దియా అధికారులు ఇంకా ఆదాయ మార్గాలను అనే్వషిస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్తిపన్ను పన్ను పెంపు, ట్రేడ్ లైసెన్సుల సీలింగ్ ఎత్తివేత, వ్యాపార సంస్థలకు సిటీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఛార్జీలను వడ్డించేందుకు సిద్ధమవుతోంది. ఎప్పటికపుడు చెత్త తరలింపును పర్యవేక్షించాల్సిన అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్లు, ఎస్‌ఎఫ్‌ఏలకు సైతం స్వచ్ఛ ఉల్లంఘనల జరిమానాల వసూళ్ల టార్గెట్లు ఇవ్వటంతో నగరంలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో చెత్త కుప్పలుగా దర్శనమిస్తోంది. ఇష్టారాజ్యంగా జరిమానాలను విధిస్తూ క్షేత్ర స్థాయి సిబ్బంది జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కొంతకాలం కురిసిన వర్షాలకు భారీగా ధ్వంసం, గుంతలమయమైన రోడ్లకు సైతం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టలేదు. వీఐపీ జోన్‌లోని కొన్ని ప్రాంతాల్లో గుంతలను పూడ్చివేసి, వంద నుంచి నూట యాభై మీటర్ల పొడువున రోడ్లను వేశారు. రెసిడెన్షియల్, వ్యక్తిగత భవనాలకు 17 ఏళ్ల క్రితం ఆస్తిపన్ను పెంచిన జీహెచ్‌ఎంసీ త్వరలోనే స్వల్పంగా పెంచాలని కూడా కసరత్తు చేస్తోంది. వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి నగరంలో ఎస్‌ఆర్‌డీపీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల స్కీం వంటివి అమలు చేస్తుండటంతో ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. రోజువారీ నిర్వహణ వ్యయం, సిబ్బంది నెలసరి జీతభత్యాల చెల్లింపు కూడా గగనంగా మారిన నేపథ్యంలో ఎలాగైనా జీహెచ్‌ఎంసీకి ఆదాయ వనరులను పెంచుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా రెండురోజుల క్రితం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశంగౌడ్ సలహా మేరకు నగరంలోని పెట్రోల్ బంకులు, హోటళ్లు, ఇతర బడా వ్యాపార సంస్థల నుంచి గ్రేటర్ సిటీ డెవలప్‌మెంట్ స్పెషల్ ఛార్జీలను వసూలు చేయాలని యోచిస్తున్నారు. అయితే దీని కోసం ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రుల నుంచి అనుమతులు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి క్షేత్ర స్థాయి సిబ్బంది నెలరోజుల పాటు తమకిచ్చిన టార్గెట్ల ప్రకారం పన్ను వసూలు చేస్తేనే జీతభత్యాలు చెల్లించే వీలుంటుందని ఇప్పటికే అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. వివిధ రకాల పౌరసేవలను అందించాల్సిన బల్దియా అసలు విధులను పక్కనబెట్టి వసూళ్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు విమర్శలు విన్పిస్తున్నాయి.