హైదరాబాద్

గురునానక్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సిక్కుల ఆది గురువైన గురునానక్ 550వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు, పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గురునానక్ చిత్రపటానికి పూలమాల వేసి, సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేడుకలు హాజరైన రాగిజాతలు ఆలపించిన గుర్భానీ కీర్తనలు ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ద్వేషం, స్వార్థంతో ఎమీ సాధించలేమని, ప్రేమా, అనురాగం, సోదరభావంతో ఏదైన సాధించవచ్చని, ఈ కీర్తనలతో రాగిజాతలు సందేశమిచ్చారు. ప్రతి సంవత్సరం విశాల్ దివాస్ పేరిట ఎంతో ఘనంగా నిర్వహించే గురునానక్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశామని, కార్యక్రమానికి నగరంలోని వివిధ గురుద్వారాలకు చెందిన ప్రతినిధులే కాకుండా, శివారు ప్రాంతాల నుంచి కూడా వేల సంఖ్యలో సిక్కులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.