హైదరాబాద్

ఉల్లంఘనులపై సెల్ నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేంకు జీహెచ్‌ఎంసీ రూపొందించిన స్వచ్ఛ నిబంధనలను ఉల్లంఘించే వారిని ఇకపై ఆటోమెటిక్‌గా గుర్తించనున్నారు. నగరంలో ఎక్కడైనా రోడ్ల, నాలాల్లో చెత్త వేసినా, వాల్‌రైటింగ్ చేయటం, పోస్టర్లు అంటించటం వంటి ఇతరత్ర ఉల్లంఘనకు పాల్పడినా, దాన్ని జీహెచ్‌ఎంసీకి చెందిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(ఈవీడీఎం) ఫొటో తీసి అప్‌లోడ్ చేసి నేరుగా ఇంటికే ఈ-నోటీసును పంపేందుకు వీలుగా సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి వెల్లడించారు. గత నెలరోజులుగా అమల్లోకి తెచ్చిన ఈ సెల్‌తో రోజుకి 30 నుంచి 35వరకు, గడిచిన నెలరోజుల్లో ఇప్పటి వరకు 1084 చలానాలు జనరేట్ చేసి సుమారు రూ.కోటిన్నర జరిమానాలు వడ్డించగా, ఇందులో రూ.15.26లక్షలు వసూలు కూడా చేసినట్లు తెలిపారు. వీటిలో అత్యధికంగా జరిమానాలు సికిందరాబాద్ జోన్‌లో విధించినట్లు ఆయన వెల్లడించారు. క్యాష్‌లెస్, కాంటెక్టులెస్, అకౌంటెబిలిటీగా ఈ జరిమానాలు విధించినట్లు, వసూలు చేసినట్లు వారు వెల్లడించారు. ఈ సెల్‌ను జనవరి 1వ తేదీ నుంచి జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాలకు వర్తింపజేసే, అందరూ అధికారులు లాగిన్ అయ్యేలా విస్తరించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏప్రిల్ మాసం నుంచి నగరవాసులు కూడా ఈ సెల్‌లో ఫిర్యాదులు లాగిన్ చేసేలా అందుబాటులోకి తేనున్నట్లు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి వివరించారు. ఇప్పటి వరకు ఈ రకమైన ఉల్లంఘనలకు సంబంధించి ఫొటోలతో సహా జరిమానాలు విధించి వ్యవస్థ మన రాష్ట్ర పోలీసుల వద్ద మాత్రమే ఉందని, మున్సిపల్ రంగంలో ఈ రకమైన సెల్‌ను అందుబాటులోకి తెచ్చి, ఉల్లంఘనను గుర్తించి, దానికి సంబంధించిన సాక్ష్యాలను సైతం జతపరిచి, అందుకు చట్టం ప్రకారం వేయాల్సిన జరిమానా వివరాలను తెలియజేసి,పారదర్శకంగా జరిమానాలు వసూలు చేస్తున్న దేశంలోని మొట్టమొదటి కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ ఎదిగిందని వారు వ్యాఖ్యానించారు.
సీఈసీ ఎలా పనిచేసే తీరిది
మహానగరంలోని పబ్లిక్ ప్లేస్‌లలో, చెరువులు, నాలాలు, రోడ్లపై ఎక్కడ చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలను వేసినా, స్థానికంగా విధులు నిర్వర్తించే సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్(సీఈసీ) అధికారి దాన్ని ఫోటో తీసి సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌కు అప్‌లోడ్ చేస్తాడు. వెంటనే సిస్టమ్ ఆ ఉల్లంఘ క్యాటగిరీని ఎంపిక చేసుకుని, కేసు ఐడీ నెంబరును క్రియేట్ చేసి, ఉల్లంఘనకు సంబంధించి హైదరాబాద్ మున్సిపల్ యాక్టు ప్రకారం నిర్ణయించిన జరిమానాను నిర్ణయించి, ఛలానాను జనరేట్ చేసి, ఈ-నోటీసులు పంపనుంది. నోటీసులు జనరేట్ అయిన తర్వాత బాధ్యుడు ఇరవై నాలుగు గంటల్లో ఆన్‌లైన్‌లో గానీ, లేక నేరుగా ప్రధాన కార్యాలయంలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా జనరేట్ అయిన చలానాలకు ముప్పై రోజుల్లో జరిమానాలు చెల్లించకుండా ఆటోమెటిక్‌గా సిస్టమే మళ్లీ గుర్తుచేసేలా దీన్ని రూపొందించారు. ఈ రకంగా ఒకసారి చలానాలు చెల్లించిన వారు మళ్లీ అదే తప్పును పునరావృతం చేస్తే మొదటి దశగా విధించిన జరిమానా కాస్త రెండింతలు చేసి, మళ్లీ చలానాలు విధించి, మరోసారి ఈ-నోటీసులు కూడా పంపేలా దీన్ని రూపకల్పన చేశారు.
ప్రస్తుతం 24..అదనంగా మరో 40
స్వచ్ఛ నిబంభనల ఉల్లంఘనలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, వాటిని ఫొటోలు తీసి సెల్‌కు అప్‌లోడ్ చేసేందుకు ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 బృందాలున్నాయని, మున్ముందు వాటికి అదనంగా 40 చేర్చి, వాటి సంఖ్యను 64కు పెంచనున్నట్లు విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఈ బృందాలు పారదర్శకంగా పనిచేసేందుకు వీలుగా ఇందులోని అధికారులు, సిబ్బంది ఎక్కువ రోజులు ఒకే చోట పనిచేయకుండా తరుచూ ఒక చోట నుంచి మరో చోటకు బదిలీలు చేయనున్నట్లు ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మార్పు కోసమే చలానాలు: మేయర్
మహానగరవాసుల్లో స్వచ్ఛ మార్పు కోసమే ప్రస్తుతం చలానాలు విధిస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. రోడ్లపై, నాలాల్లో, చెరువుల్లో ఎక్కడబడితే అక్కడ భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్తాచెదారం వేయరాదన్న అంశంపై అనేక రకాలుగా అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించినా మార్పు రాకపోవటంతో కొంత కఠినంగా వ్యవహారించాలన్న సంకల్పంతోనే ఈ చలానాలు విధిస్తున్నట్లు మేయర్ తెలిపారు. తెలంగాణ నట తేజం కాంతారావు
కాచిగూడ, నవంబర్ 16: తెలంగాణ నట తేజం కాంతారావు అని ప్రముఖ కవి, గేయ రచయిత డా.వడ్డేపల్లి కృష్ణ అన్నారు. ప్రముఖ సినీ నటుడు టీ ఎల్ కాంతారావు జయంతి సందర్భంగా బృందావనం సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వడ్డేపల్లి కృష్ణ పాల్గొని కాంతారావు చిత్ర పటానికి నివాళి అర్పించారు. కాంతారావు పౌరాణిక చిత్రాలలో అనేక పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని వివరించారు. ప్రముఖ గాయకుడు వై.మల్లికార్జునమ్ నిర్వహణలో గాయనీ, గాయకులు రాఘవరావు, భరద్వాజ, నిఖిల, ప్రభాకర్, పద్మావతి పాల్గొన్నారు.