హైదరాబాద్

సమస్యల పరిష్కారానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి ఉషారాణి ఆదేశించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను పరిశ్రమల శాఖాధికారి రాజేశ్వర్ రెడ్డితో కలిసి డీఆర్‌ఓ స్వీకరించారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ ఎరుకల నాంచారమ్మ బస్తీ సర్వే 5లో చేపడుతున్న డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులను మొదటి విడతలో 155 మందిని అప్పటి కలెక్టర్ విడుదల చేశారని, అందులో 22 మందికి పట్టాలు ఇవ్వలేదని, త్వరలో ఇళ్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నందున జీహెచ్‌ఎంసీ పీడీకి సిఫారసు చేయగా కేసులో ఉన్నా మొదటి విడతలో పేర్లు వచ్చిన వారందరికీ తప్పకుండా లాటరీ పద్ధతిలో ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బుచ్చమ్మ, సారమ్మ, కృష్ణవేణి, మారెక్క, రాంబాబు, లావణ్య, ముత్యాలు, లలిత, వెంకటమ్మ, నాగమ్మ, ముత్యాలమ్మ, మమత పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఉషారాణి మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి, పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను ప్రజావాణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.