హైదరాబాద్

సిటీలో కమిషనర్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కార్పొరేషన్ జంటనగరవాసులకు అందిస్తున్న పౌరసేవల నిర్వహణ, వివిధ అభివృద్ధి పనులు పురోగతిని ఆయన పరిశీలించారు. కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దిన్‌తో కలిసి కమిషనర్ పనులు పనులను పరిశీలించారు. ప్రస్తుతం టోలీచౌకీలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. బ్రిడ్జికి సమీపంలో రోడ్డును నిర్మించాలని స్తానికులు కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా, జలమండలి ద్వారా జరుగుతున్న పనులు పూర్తయిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బల్కాపూర్ నాల రిటైనింగ్ వాల్‌ను పరిశీలించారు. అనంతరం మిలిటరీ క్యాంపస్ ద్వారా వెళ్లాల్సిన ఓపెన్ డ్రైన్ నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జియాగూడ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ అక్కడి ఓపెన్ గ్యార్బెట్ పాయింట్ బహిరంగంగా కన్పించుకుండా రేకులతో ప్రహరీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం కఠోరా హౌజ్ వద్ద శానిటేషన్ కార్యక్రమాలను పరిశీలించారు. జియాగూడలో వంద ఫీట్ల రింగ్‌రోడ్డును కలుపుతూ కిషన్‌బాగ్‌కు ప్రత్యేక రోడ్డును నిర్మించాలని ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దిన్ కమిషనర్‌ను కోరారు. ఇందుకు స్పందించిన కమిషనర్ పురానాపూల్ జంక్షన్‌ను విస్తరించడానికి అవరోధంగా ఉన్న భూసేకరణను వెంటనే చేపట్టాలని డా. బి. జనార్దన్ రెడ్డి సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. షేక్ పేట సెవెన్ టూంబ్స్ సమీపంలోని పార్కును పరిశీలించి, ఈ పార్కును సందర్శకులకు తగిన సౌకర్యాలను కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో కమిషనర్‌తో పాటు జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, చీఫ్ ఇంజనీర్ ఇంతియాజ్ అహ్మద్, డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్ తదితరులున్నారు.