హైదరాబాద్

‘ఎర్లీబర్డ్’తో రూ. 200 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: మహానగర పాలక సంస్థకు ప్రధాన ఆర్ధిక వనరైన ఆస్తిపన్నులో రిబేటు పొందేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎర్లీబర్డ్ స్కీం శనివారంతో ముగిసింది. ఈ నెల 1వ తేదీ నుంచి రాష్టవ్య్రాప్తంగా అమలైన ఈ పథకానికి సంబంధించి జిహెచ్‌ఎంసిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రూ. 200 కోట్ల వరకు ఆస్తిపన్ను వసూలైంది. పన్ను వసూళ్లను పెంచుకునేందుకు జిహెచ్‌ఎంసి ఎంతో చక్కగా ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకుంది. ఈ స్కీంకు సంబంధించి బకాయిదారులను చైతన్యవంతులను చేసేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రత్యేక ప్రచారం ఫలించి, జిహెచ్‌ఎంసి లక్ష్యంగా పెట్టుకున్న స్థాయిలో పన్ను వసూలు చేసుకోగల్గింది. గత సంవత్సరం 2015 ఏప్రిల్ మాసం మొత్తం అమలు చేసిన ఇదే స్కీంతో రూ. 177 కోట్లు మాత్రమే వసూలు కాగా, ఈ సారి అదనంగా రూ. 23 కోట్లను వసూలు చేసుకుని ఎర్లీబర్డ్ వసూళ్లను రూ. 200 కోట్ల టార్గెట్ దాటించారు. ఈ వసూళ్లు కూడా రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే అయినవని, స్కీం అమలుకు రాత్రి పనె్నండు గంటల వరకు సమయమున్నందున వసూళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. నెలరోజుల వ్యవధిలో ఈ ఎర్లీబర్డ్ స్కీంను దాదాపు 2లక్షల 40వేల మంది వినియోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత సంవత్సరం ఇదే ఏప్రిల్ మాసం మొత్తంలో 2లక్షల 64వేల మంది ఈ స్కీంను సద్వినియోగం చేసుకున్నా, అప్పట్లో వసూళ్లు కేవలం రూ. 177 కోట్ల 33 లక్షలకే పరిమితమైంది. అయితే ఈ సంవత్సరం ఎర్లీబర్డ్‌ను వినియోగించుకునే వారిలో పెద్ద మొత్తంలో ఆస్తిపన్ను చెల్లించే సంస్థలు, కార్యాలయాలు, వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరగటం వల్లే బకాయిదారుల సంఖ్య తగ్గి, కలెక్షన్ పెరిగిందని తెలిపారు. రూ. 1200లోపు ఆస్తిపన్ను చెల్లించే మొత్తాన్ని గత కొద్దినెలల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ రూ. 101కు కుదిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే! ఈ నిర్ణయంతో కార్పొరేషన్‌కు రూ. 20 కోట్ల వరకు నష్టం ఏర్పడింది. నామమాత్రంగా చెల్లించాల్సిన రూ. 101 ఆస్తిపన్నుకు కూడా ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేయటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. చెల్లించాల్సిన మొత్తం బకాయిలో అయిదు శాతం రిబేటు ఇస్తూ అమలు చేసిన ఈ పథకం అమలు పై డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్ చేపట్టిన నిరంతర సమీక్ష సత్ఫలితాలిచ్చిందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందరి సమష్టి కృషి వల్లే గత ఏడాది ఏప్రిల్ మాసం కన్నా ఈ సారి కలెక్షన్ ఎక్కువ చేయగలిగామని కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.