హైదరాబాద్

పరుగుతీస్తూ ప్రాణం వదిలాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: ఉద్యోగం కోసం ఒడిసా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ యువకుడు ఫిజికల్ ఫిట్నెస్‌లో భాగంగా మైదానంలో అందరితో కలిసి రన్నింగ్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంఘటన శనివారం ఉదయం చాంద్రాయణగుట్ట పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీసుల కథనం ప్రకారం సిఆర్‌పిఎఫ్‌లో మెడికల్ విభాగంలో వివిధ స్థాయి ఉద్యోగాల కోసం చాంద్రాయణగుట్ట సిఆర్‌పిఎఫ్ ట్రెయినింగ్ సెంటర్‌లోని మైదానంలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్టును శనివారం నిర్వహించారు. ఈపరీక్షలకు దేశవ్యాప్తంగా మూడు వందల మంది హాజరు కావాల్సి ఉండగా కేవలం 34 మంది హాజరయ్యారని పోలీసులు తెలిపారు. వీరిలో 12 మంది మహిళలు, 22మంది యువకులు ఉన్నారు. ముందుగా సిఆర్‌పిఎఫ్ అధికారులు 22 మంది యువకులకు 1600 మీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించారు. రన్నింగ్ పోటీలో పాల్గొన్న ఒడిసాకు చెందిన హిమాంషుచంద్రజేన(29) 800 మీటర్ల వరకు పరుగు తీసి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిఆర్‌పిఎఫ్ అధికారులు, స్థానిక సిఆర్‌పిఎఫ్ ఆసుపత్రి వైద్యులు చికిత్స నిర్వహించినా పరిస్థితి మెరుగుకాకపోవడంతో పిసల్‌బండా మిధాని వద్ద గల డిఆర్‌డిఓ అపోలో ఆసుపత్రికి తరలించేలోపు మర్గమధ్యంలో మృతి చెందాడు. సిఆర్‌పిఎఫ్ అధికారులు, చాంద్రాయణగుట్ట పోలీసులు హిమాంషుచంద్రజేనా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ కేసును చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ లక్ష్మయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.