హైదరాబాద్

అటకెక్కిన అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరాన్ని స్వచ్ఛనగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ చేపట్టిన చర్యల్లో భాగంగా రోడ్లపై ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం, భవన నిర్మాణ వ్యర్థాలు వేసే వారికి, ఎక్కడబడితే అక్కడ అక్రమంగా ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేసే వ్యక్తులు, సంస్థలకు నుంచి భారీగా జరిమానాలను వడ్డిస్తున్న సంగతి తెలిసిందే! కానీ ఈ విషయంలో ప్రజల్లో తొలుత అవగాహన కల్పించి, ఆ తర్వాతే జరిమానాలు వసూలు చేస్తామని చెప్పుకొచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానాలకు సంబంధించి సర్కారు జీవో వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా జరిమానాలు వడ్డిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఎలా ంటి కార్యక్రమాలను నిర్వహించకుండానే నేరుగా జరిమానాలను వసూలు చేయటం విమర్శలకు తావిస్తోంది. జరిమానాలకు సంబంధించి అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై, చెరువుల్లో, నాలాల్లో వేసి వారిని గుర్తించి జరిమానాలను వసూలు చేయాల్సి ఉండగా, చిన్న చిన్న వ్యక్తిగత నివాసాలను నిర్మించుకునేందుకు యజమానులు భవన నిర్మాణ సామాగ్రిని రోడ్డు,్ఫట్‌పాత్‌పై వేసినా, దాన్ని కూడా డెబ్రీస్ కింద లెక్కకట్టి జరిమానాలు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే సెంట్రల్ జోన్‌లోని ఓ ప్రాంతంలో ఓ చిన్న ఇంటిని నిర్మించుకునేందుకు యజమాని సమీపంలోని ఫుట్‌పాత్‌పై మూడు వేల ఖరీదు చేసే కంకర వేశారు. రోడ్డుపై భవన నిర్మాణ వ్యర్థాలను వేశారంటూ జీహెచ్‌ఎంసీ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ యజమానికి రూ. 25వేల జరిమానా విధించటం జీహెచ్‌ఎంసీ అత్యుత్సాహానికి నిదర్శనం. కేవలం మూడువేల రూపాయల విలువ చేసే కంకరకు రూ.25వేల జరిమానా విధించటం పట్ల యజమానికి లబోదిబోమంటున్నాడు. ఇంటిని నిర్మించుకునేందుకు తెచ్చుకునే భవన నిర్మాణ సామాగ్రిని సైటు నుంచి సమీపంలో వేసుకోకుండా, మరెక్కడ వేయాలని కొందరు యజమానులు వాదిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన సిబ్బంది టీ, టిఫిన్, భోజనాలు విక్రయించే హోటళ్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పట్ల చూసీచూడనట్టుగా వ్యవహారిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మురికివాడలు, బస్తీల్లో సుమారు 40 నుంచి 60 గజాల్లోపు ఇళ్లను నిర్మించుకునే వారికి షరతులతో నిర్మాణ సామాగ్రిని సైటుకు సమీపంలో వేసుకునేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ అధికారులు వెసులుబాటు కల్పించాలని పేద, మధ్య తరగతి చెందిన ఇంటి యజమానులు కోరుతున్నారు.