హైదరాబాద్

అనుమతి లేని స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ మండలం పరిధిలో అనుమతి లేకుండా నడుస్తున్న హిదాయా ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రవిని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ కోరింది. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో టీచర్లు కలిసి ఫిర్యాదు అందజేశారు. పాఠశాల నిర్వాహణపై విచారణ జరిపి, వివరాలతో నివేదికను సమర్పించాలని జిల్లా రెవెన్యూ అధికారిని జేసీ ఆదేశించారు. తార్నాక డివిజన్‌లో ప్రత్యేక దివ్యాంగుల పాఠశాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, ఇందుకు సానుకూలంగా స్పందించిన జేసీ ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఉపాధి, రుణాలు, ఇళ్లు, పెన్షన్లు వంటి అంశాలకు సంబంధించి ఫిర్యాదలు, ఆర్జీలను సమర్పించారు. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రతి విభాగాధిపతి కృషి చేయాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు శ్రీనివాస్ రెడ్డి, రాజా గౌడ్‌తో పాటు ఇన్‌చార్జి డీఆర్‌ఓ సంగీత, బీసీ సంక్షేమాధికారి విమలాదేవి, అదనపు డీఎంహెచ్‌ఓ నిర్మల ప్రభావతి, వికలాంగుల సంక్షేమ అధికారి పుష్పలత, ఎల్జీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.