హైదరాబాద్

బాలల చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: బాలల న్యాయ చట్టం (జువనైల్ జస్టిస్) 2015ను సమర్ధవంతంగా అమలు చేసి బాధిత పిల్లలకు సత్వర న్యాయం జరిగేలా అన్నిచర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయ సేవల సంస్థ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం బేగంపేటలోని మేరీగోల్డ్ హోటల్‌లో జువనైల్ జస్టిస్ చట్టంపై బాలల సంక్షేమ సంస్కరణ సర్వీసులు మరియు వీధి బాలల సంక్షేమం, పోలీసు శాఖ (సిఐడి) యునిసెఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్టస్థ్రాయి సమన్వయ సమావేశాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు నేర ప్రవృత్తివైపు మళ్లకుండా వారిని సన్మార్గంలో నడిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని అన్నారు.
తెలిసీ తెలియని వయసులో పిల్లలు నేరాలకు పాల్పడుతుంటారని అందుకు వారు పెరిగే వాతావరణం ప్రధాన కారణం అని అన్నారు. పిల్లలు నేర ప్రవృత్తికి దూరంగా వుంచేందుకు విద్య ఒక్కటే చక్కటి మార్గమని అన్నారు. పిల్లలందరు విద్యనభ్యసించేందుకు వీలుగా తల్లిదండ్రులు విధిగా వారిని పాఠశాలకు పంపించాలని సూచించారు. ఇప్పటికే నేరారోపణలు, శిక్ష అనుభవిస్తున్న పిల్లలకు ఈ చట్టం కింద సత్వర న్యాయం జరిగేలా పోలీసులు, న్యాయ వ్యవస్థ, బాలల సంక్షేమ సమితులు, బాలల న్యాయ మండలులు, చైల్డ్ లైన్ సమన్వయ కర్తలు, ప్రోబేషన్ అధికారులు సమిష్టిగా పనిచేయాలన్నారు. కేసులను నాలుగు నుండి ఆరు నెలల లోపు పరిష్కరించాలని తెలిపారు. శిక్ష పూర్తయిన పిల్లలను తిరిగి జన జీవన స్రవంతిలోకి తీసుకువెళ్లి పునరావాసం కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు బాలల న్యాయసమితి చైర్మన్, జస్టిస్ రమేశ్ రంగనాధన్ మాట్లాడుతు సంబంధిత శాఖల సమన్వయ లోపంతో న్యాయం చేయడంలో జాప్యం జరుగుతోందని ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి కేసులను చేపట్టే వ్యక్తులు, సంస్థల మధ్య సమన్వయం అవసరమన్నారు.
ఐజి సౌమ్యా మిశ్రా (సిఐడి) మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు శాఖలో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి వారి వారి బాధ్యతలను కచ్చితంగా సూచిస్తామని తెలిపారు. పోలీసు శాఖనే కాకుండా ఇతర శాఖలలో సంప్రదించాల్సిన అధికార వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో స్ర్తి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, యునిసెఫ్ ప్రతినిధి రూత్ లియానో, జువనైల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ వెంకటేశ్వర్‌రెడ్డి, బాలల సంక్షేమ సంస్కరణల సర్వీసులు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ డైరక్టర్ శ్రీమతి శైలజ, పోలీసు అధికారులు, జిల్లా జువనైల్ జస్టిస్ బోర్డుల ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్స్, జిల్లాస్థాయి చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ సభ్యులు, బాలల సంరక్షణ అధికారులు, చైల్డ్‌లైన్ కో ఆర్డినేట్‌లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.