హైదరాబాద్

ఊపందుకోనున్న సాగర్ ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో జరుగుతుందా? లేదా అన్న అనుమానానికి తెర పడింది. సాగర్ కలుషితం, చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై జిహెచ్‌ఎంసి అధికారులు ప్రత్యేక కార్యచరణను సిద్దం చేయాలని ఆదేశిస్తూ, శాస్ర్తియంగా నిమజ్జనం జరగాలని సూచించటంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. కానీ హుస్సేన్‌సాగర్‌తో పాటు గణేష్ విగ్రహాల నిమజ్జనం ఎక్కడికక్కడే వికేంద్రీకరణగా జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు గాను గ్రేటర్‌లోని మరో తొమ్మిది చెరువుల్లో కూడా ప్రత్యేక పాండ్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. చెరువుల్లో నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేసి, కోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనం ముగిసిన వెంటనే వ్యర్థాలను తొలగించేందు జిహెచ్‌ఎంసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగుళూరు తరహాలో చెరువులో ఒక చోట శాస్ర్తియంగా విగ్రహాలను నిమజ్జనం చేసుకుంటూ, మొత్తం చెరువు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే దశాబ్దాలుగా హుస్సేన్‌సాగర్‌ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఏ) జైకా నిధులతో ప్రక్షాళన చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే! ఎప్పటికపుడు నిధులు కరిగిపోతున్నాయే తప్పా, సాగర్ ప్రక్షాళన ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదన్న విమర్శలున్నాయి. కానీ ఏ గణేష్ విగ్రహాల నిమజ్జనంతో చెరువు మొత్తం కలుషితమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అదే వినాయక నిమజ్జనంతో సాగర్ ప్రక్షాళన పనులు ఊపందుకోవటం విశేషం. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఎన్‌క్లోజర్‌ను శుద్ధి చేయటంతో పాటు అంతలోపు సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలతో నిమజ్జనం తర్వాత కూడా ప్రక్షాళన పనులు వేగవంతం కానున్నాయి. నిమజ్జనంపై ఈ సారి సర్కారు ప్రత్యేక దృష్టి వహించటమే గాక, ఎత్తు నియంత్రణ, సహజసిద్దమైన రంగుల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారీగా ఎత్తున చేపట్టే పలు కార్యక్రమాలతో గతంలో కన్నా ఈ సారి నిమజ్జనానికి సాగర్‌లో కలుషితం బాగా తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతేగాక, ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా నిమజ్జనం ముగిసిన వెంటనే వ్యర్థాలను తొలగించే అవకాశమున్నందున, ఇపుడు కాకపోయినా, మరికొద్ది సంవత్సరాల తర్వాతనైనా సాగర్‌లు కలుషితం తగ్గుముఖం పట్టే అవకాశాల్లేకపోలేవు.

పాండ్ల ఏర్పాటు ఇలా!
వ.నెం చెరువు వ్యయం(రూ.లక్షల్లో)
1 హుస్సేన్‌సాగర్, సికిందరాబాద్ 85
2 ఊర చెరువు(కాప్రా చెరువు), కాప్రా 67
3 చెర్లపల్లి చెరువు, ఘట్‌కేసర్ 67
4 పర్కి చెరువు, కూకట్‌పల్లి 68
5 పెద్ద చెరువు, గంగారం, శేరిలింగంపల్లి 67
6 వెనె్నల చెరువు జీడిమెట్ల 67
7 రంగధముని కుంట, ఐడిఎల్ చెరువు 67
8 మల్క చెరువు రాయదుర్గం 67
9 నల్లగండ్ల చెరువు, నల్లగండ్ల, శేరిలింగంపల్లి 67
10 లార్జ్ ట్యాంకు సరూర్‌నగర్ 70