హైదరాబాద్

ఉద్యమ వ్యతిరేకులకు కేసిఆర్ పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, నాచారం, ఏప్రిల్ 30: దొంగలందరినీ పిలిచి కండువాలు కప్పుతున్న కెసిఆర్ ఇదే తెలంగాణ పునరేకీకరణ అంటున్నారని తెలంగాణ ఉద్యమసంఘాల జెఎసి చైర్మన్ డాక్టర్ చెరుకు సుధాకర్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి నుంచి యావత్ తెలంగాణలో బస్సుయాత్రను నిర్వహించి శనివారం ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఒకవైపు అధికారం రాకముందు ఉద్యమ సమయంలో ఓపన్‌కాస్ట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపన్‌కాస్ట్‌లను ప్రోత్సహిస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తూ తెలంగాణ విధ్వంసానికి పునాదులు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వర్‌రావు కుడిభుజం అని చెప్పడానికి కెసిఆర్‌కు మనసు ఎలా వచ్చిందని, ఖమ్మంలో జైలులో పెట్టినప్పుడు ఈ కుడిభుజం ఎక్కడపోయిందని ఆయన ప్రశ్నించారు. ఆనాడు కుడిభుజాలుగా వెన్నుదన్నుగా నిలిచి ఎన్నో త్యాగాలకు ఓర్చి నిలిచిన ఉద్యమకారులు ఎక్కడ పోయారని ఆయన ప్రశ్నించారు. ఖమ్మంలో జరిగిన ఫ్లీనరీలో ప్రజాప్రతినిధులనే ఆహ్వానించామని చెప్పిన కెసిఆర్ ఉద్యమ సమయం నుంచి పనిచేసిన వారు ఎంతమంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారని అన్నారు. నిజాయితీపరులను రోడ్లపై నిలబెట్టి దొంగలకు పెద్దపీట వేస్తున్న కేసిఆర్‌కు చిత్తశుద్ది లేదని అన్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో కాలం కలిసొస్తే నడిచివచ్చే కొడుకు వస్తాడని చెబుతున్న కేసిఆర్ ఏనాడైనా తుమ్మల తెలంగాణ ఉద్యమం కోసమైనా తెలంగాణ అభివృద్ధి కోసమైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తుమ్మలను ఘోరంగా ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నట్లు చెరుకు తెలిపారు. అదేవిధంగా జెఎసి చైర్మన్ కోదండరామ్ అధ్యయనాలు కాదు ప్రజల్లోకి రావాలని, ఉద్యమం చేయాలని తాము ఇచ్చిన పిలుపుకు ఆయన స్పందనను స్వాగతిస్తున్నామని అన్నారు. భవిష్యత్‌లో అన్ని జెఎసిలతో కలిసి రాష్ట్ర స్థాయి ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు సాగుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో మొదటి నుంచి పనిచేసిన నాయకులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని అలాంటివారిని కేసిఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. అలాంటివారు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకునిబతుకు తెలంగాణ కోసం ఉద్యమించడానికి ముందుకు రావాలని చెరుకు పిలుపునిచ్చారు.