హైదరాబాద్

కలియుగ దైవం శ్రీవేంకటశ్వర స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రముఖ రచయిత హేమకుమార్ రచించిన ‘వినా వేంకటేశం’ ఆడియో సీడీ ఆవిష్కరణ సభ ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైవీ సుబ్బారెడ్డి పాల్గొని సీడీని ఆవిష్కరించారు. అన్నమయ్య 30వేలకు పైగా కీర్తనలు రచించి స్వామి భక్తిని చాటుకున్నారని పేర్కొన్నారు. హేమ కుమార్ రచించిన భక్తి పాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పిస్తామని వివరించారు. బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత సినీ నటుడు తనికెళ్ళ భరణి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి, ఎమ్మెల్సీ రామచందర్ రావు పాల్గొన్నారు.

తెలుగు ఆత్మగౌరవ ప్రతీక బాపు రమణ
కాచిగూడ, డిసెంబర్ 15: తెలుగు ఆత్మగౌరవ ప్రతీక బాపు రమణ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణ చారి అన్నారు. ప్రముఖ చిత్రకారుడు శంకర్ నారాయణ, ప్రముఖ దర్శకుడు వంశీకి బాపు రమణ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బాపు రమణ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేవీ రమణ చారి పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు. బాపు రమణ తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రా వేసుకున్నరని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, జోన్నవిత్తుల రామలింగేశ్వర రావు, నటి దివ్యవాణి, వేమూరి సత్యనారాయణ, గాయత్రి భార్గవి పాల్గొన్నారు.