హైదరాబాద్

లష్కర్‌లో నిరంతర నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వివిధ సంఘటనల దృష్ట్యా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేసి నిరంతరం తనీఖీలు నిర్వహించనున్నట్లు గోపాల్‌పురం సబ్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పీ.వెంకటరమణ తలిపారు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారు అధికంగా రైళ్లలో ప్రయాణం చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల దృష్ట్యా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలో ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్‌ను 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకునేల సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు సూచనలీవ్వడం జరిగిందన్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలో గతంలో చైన్‌స్నాచింగ్‌లతో అనేక సంఘటనలు చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పోలీసు బందోబస్తును రెట్టింపు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో నిరంతరం పోలీసు పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ పోలీసులు తిరుగుతూ రోడ్డుపై వచ్చిపోయోవారిని నిశితంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. సికింద్రాబాద్‌లో ఎవైన సంఘటనలు జరిగితే అక్కడునవారు కని, సంఘటన చూసిన వ్యక్తులు మానవత దృక్పథంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అవసరమైతే 100 నెంబర్‌కు డాయాల్ చేయాలని ఏసీపీ వెంకటరమణ సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహాకరించాలని ఏసీపీ ప్రజలను కోరారు. దక్షిణ మధ్య రైల్వే విభాగంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చాలపెద్దదని, ఇక్కడ రైల్వే స్టేషన్ బయట ఎలాంటి సంఘటనలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వెంకటరమణ తెలిపారు.