హైదరాబాద్

తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 30: ఎన్నో పోరాటాల అనంతరం ఏర్పడ్డ తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. శనివారం లక్డీకాపూల్‌లోని ఫ్యాప్సీ భవన్‌లో యుద్ధవీర్ ఫౌండేషన్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఏడు యుద్ధవీర్ అవార్డుకు ఎంపికైన భాష్యకారుడు, సంస్కృత పండితుడు డాక్టర్ విజయ్ వీర్ విద్యాలంకార్‌కు యుద్ధవీర్ స్మారక పురస్కారాన్ని కేశవరావు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేశవరావు యుద్ధవీర్ స్మారకోపన్యాసం చేశారు. స్వాంతంత్య్ర మరయోధుడు, పాత్రికేయులు యుద్ధవీర్ పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని ఆచార్యులు డాక్టర్ విజయ్ వీర్ విద్యాలంకార్‌కు తన చేతుల మీదుగా అందించడం ఆనందంగా ఉందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షతకు గురైందని అన్నారు. తెలంగాణ యాసను, భాషను, సంస్కృతిని వెక్కిరించడంతో పాటు ఈ ప్రాంతానికి చెందాల్సిన వనరులను యధేచ్ఛగా దోచుకున్నారని వివరించారు. తెలంగాణ ప్రాంతం అంటేనే భిన్న సంస్కృతులకు నిలయమని, ఇక్కడికి ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎంతో మంది వచ్చి జీవిస్తున్నారని, వారంతా ఇక్కడి సంస్కృతిని గౌరవించారని, అదే సమయంలో ఇక్కడి ప్రజలు వారిని ఆదరించారని చెప్పారు. అదే తరహాలో ఇక్కడికి వచ్చిన ఆంధ్రవారు ఈ ప్రాంతాన్ని వలస ప్రాంతంగా భావించడంతో నిరసనలు ప్రారంభమై అవి తీవ్ర రూపం దాల్చి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారి తీశాయని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో తమ పని పూర్తి అయిందని తాము భావించడం లేదని, గత వైభవాన్ని తెలంగాణకు తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా విద్యారంగాన్ని, ఇరిగేషన్ రంగాన్ని బలోపేతం చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణ పౌరులు విద్యావంతులైతే అభివృద్ధి సాధ్యమని గమనించే విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని, 200 గురుకుల పాఠశాలలు నిర్మించి ప్రపంచస్థాయి విద్యనందించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు ప్రాజెక్టులను నిర్మించడం, స్వచ్ఛమైన నీటిని అందించేందుకు మిషన్ భగీరథ వంటి పథకాలను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ నరేంద్ర లూతర్, బజ్‌రంగ్‌లాల్ గుప్తా, సియాసత్ ఎడిటర్ జాహెద్ అలిఖాన్, మురళీధర్ గుప్తా పాల్గొన్నారు.