హైదరాబాద్

లక్ష్యాల సాధనకు పూర్తి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: రైల్వేలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ పనులను నిర్ధేశిత లక్ష్యం మేరకు పూర్తిచేసేందుకు ప్రయత్నించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా తమ విభాగానికి చెందిన ఇంజనీర్లను ఆదేశించారు. ఇందుకు రైల్వేలోని సంబందిత శాఖలన్నీ పూర్తి సహకారం అందిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు.
సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో రెండు రోజులుగా జరుగుతున్న దక్షిణ మధ్య రైల్వే ఇంజనీర్ల సమావేశం ముగింపు కార్యక్రమంలో శనివారం రవీంద్ర గుప్తా ప్రసంగించారు. వివిధ స్థాయిల్లో శరవేగంగా జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను మున్ముందు కూడా అదే ఒరవడితో కొనసాగించాలని ఆయన ఉద్బోధించారు. వేసవిలో రైలు ప్రయాణీకులకు తాగునీటిని సమకూర్చడం, వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించారు. దక్షిణ మధ్య రైల్వేకి చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.