హైదరాబాద్

నగరంలో గాలి దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చార్మినార్, ఏప్రిల్ 30: నగరంలో మధ్యాహ్నం పూట ఎండలు బాగా మండిపోతూనే సాయంత్రం వేళల్లో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై గాలి దుమారం రేగింది. దీంతో పలు చోట్ల చెత్తాచెదారం ఎగిరిపడటంతో బైక్‌లపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో ఎనిమిది గంటలకు ప్రారంభం కావల్సిన ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌కు వానా కాస్త ఇబ్బందులు కల్గించింది. ఒక్కసారిగా దుమ్ము, దూళితో కూడిన గాలి దుమారం రేగటంతో అప్పటి వరకు మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన జనం గాలికి తట్టుకోలేక ఇంటి ముఖం పట్టారు. ఆకాశంలో మెరుపులు, ఉరుములు ఏర్పడటంతో మరికొందరు వాన భయంతో మ్యాచ్ చూడకుండానే వెళ్లిపోయారు. గాలి దూమారానికి బలమైన ఈదురు గాలులు కూడా తోడు కావటంతో పలు చోట్ల చెట్లు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. అంతేగాక, సాయంత్రం ఆరున్నర గంటల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో చల్లటి గాలులతో కూడిన చిరుజల్లులు కురవటంతో వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా మారింది.
బలమైన ఈదురుగాలులు వీయటంతో కొందరు వాహనదారులు బైక్‌లను ఆపి, ట్యాంక్‌బండ్‌పై నిలిచిపోయారు. సాయంత్రం అయిదు గంటల నుంచి ఉప్పల్, హబ్సిగూడ, సికిందరాబాద్, బేగంపేట, పంజాగుట్ట, అమీర్‌పేట, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో వేర్వేరు సమయంలో వర్షపు చినుకులు నగరవాసులను పలకరించాయి.
వర్షం కారణంగా లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, రాణిగంజ్, ప్యారడైజ్, క్లాక్ టవర్, ముషీరాబాద్, ఆర్టీసి క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్, హిమాయత్‌నగర్, సికిందరాబాద్ స్టేషన్, కోఠి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడింది.
చిరు జల్లులతో సేదతీరిన ప్రజలు
సికింద్రాబాద్: ఎండవేడితో అల్లాడుతున్న నగర ప్రజలకు శనివారం సాయంత్రం చిరుజల్లులతో తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లయింది. గత కొంత కాలంగా భానుడు ప్రతాపంతో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో వడదెబ్బలతో పలువురు అమాయకులు అసువులు బాసారు.
వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సికింద్రాబాద్, తార్నాక, ఓయు, ప్రాంతాలతోపాటు శివారు ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గాలిదుమారం చెలరేగడంతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి.
కమ్ముకున్న మేఘాలు
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం వరకు తీవ్రరూపం దాల్చిన ఎండ ఆకస్మాత్తుగా మాయమైంది. అరగంటలో ఆకాశం మేఘావృతం కావడం, వేగంగా గాలులు వీచడం, ఆతర్వాత ఆకాశంలో ఉరుములు, మెరుపులు వచ్చాయి. వికారాబాద్ పట్టణ పరిసరాల్లో ఎలాంటి వర్షం లేకపోవడం, మరోపక్క విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో తీవ్రమైన ఉక్కపోతతో పట్టణ ప్రజలు అల్లాడిపోయారు.
బయటవీస్తున్న గాలి కోసం ఇళ్ళు, వ్యాపార దుకాణాల నుండి బయటకు వచ్చి ఆరుబయట సేదతీరారు. నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వర్షం కురిసినట్లు సమాచారం.