హైదరాబాద్

నేరాల అదుపునకు పౌరుల సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మే 1: పోలీసులతో పాటు పౌరులు కూడా స్వచ్ఛందంగా తమ బాధ్యతలను నిర్వహించాల్సిన అవసరం ఉందని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గం నార్త్‌జోన్ పరిధిలోని తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలతోపాటు ఆధునీకరించిన పోలీస్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నేరాల అదుపునకు సిసి కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు.
సిసి కెమెరాలతో తిరుగులేని సాక్ష్యం ఉంటుందని నేరస్తులు ఎంత తెలివైన వారైనా తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంటుందని అన్నారు. గడిచిన కాలంలో నగరంలో జరిగిన నేరాలకు ఈ నిఘానేత్రాలే అత్యంత కీలకంగా మారడంతోపాటు నిందితులను అతి త్వరగా గుర్తించడానికి వీలు కలిగిందని ఆయన గుర్తుచేశారు. ప్రతి ఒక్కరు సిసి కెమెరాల ఏర్పాటు సామాజిక బాధ్యతగా గుర్తించి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన దాదాపుసిసి కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపితోపాటు అదనపుసిపి అంజనీకుమార్, డిసిపి ప్రకాశ్‌రెడ్డి, సిఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.