హైదరాబాద్

బాల కార్మికులకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు బాల కార్మికులకు విముక్తి కలిగింది. పాతబస్తీ, రంగారెడ్డి జిల్లాలోని పలు పరిశ్రమల్లో పెద్ద ఎత్తున బాలకార్మికులు పనిచేస్తున్నట్టు చైల్డ్, ఉమెన్ వెల్ఫేర్ అధికారులు దాడులు నిర్వహించారు. పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఓ గాజుల పరిశ్రమలో పనిచేస్తున్న 16మంది కార్మికులు, రంగారెడ్డి జిల్లాలోని ఓ నెయ్యి,నూనె తయారీ కేంద్రంలో పనిచేస్తున్న 14 మంది బాలకార్మికులను గుర్తించారు. మొత్తం 30 మంది బాలకార్మికులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించి విముక్తి కలిగించారు. వీరిని వారి సొంత గ్రామాలకు తరలించినట్టు చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ అధికారులు తెలిపారు.