హైదరాబాద్

గ్రేటర్‌లో మోగనున్న సమ్మె సైరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. జిహెచ్‌ఎంసి జంటనగరవాసులకు అందిస్తున్న ముఖ్యమైన సేవల్లో పారిశుద్ద్యం పనులను ప్రైవేటు పరం చేస్తూ గతంలో రాంకీ ఎన్విరో సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని అన్ని సంఘాలు వ్యతిరేకించటంతో అమలు చేయకుండా మూలనపడేసిన అధికారులు ఇపుడు ఎంతో వ్యూహాత్మకంగా మళ్లీ రాంకీ సంస్థను రంగప్రవేశం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నగరంలో పోగవుతున్న చెత్తను తరలించేందుకు ప్రత్యేకంగా పనిచేసిన చెత్త తరలింపు విభాగంలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు చోటుచేసుకున్నాయంటూ రవాణాను జోన్లు, సర్కిళ్ల వారీగా వికేంద్రీకరణ చేసిన సంగతి తెలిసిందే! అంతేగాక, మొత్తం 900వరకున్న చెత్తను తరలించే వాహనాల్లో కాలం చెల్లాయంటూ 90 వాహనాలను స్క్రాప్ వేలం వేశారు. మిగిలిన వాహనాల్లో ఎక్కువ శాతం వాహనాలు మరమ్మతుల పాలు కావటంతో అధికారులు ప్రైవేటు వాహనాలను సమకూర్చుకునేందుకు చేసే ప్రయత్నాలు సైతం ఫలించటం లేదు. ఈ క్రమంలో నగరంలో ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. అంతెందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇన్‌ఛార్జి(మెంటర్)గా వ్యవహారించిన పార్శిగుట్టలో సైతం ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. అయితే ఈ విషయంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయటం లేదనిది ఓ వాదన అయితే, ఇక చెత్తను సేకరించి, ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించే ప్రత్యేక యంత్రాంగం గానీ, వ్యవస్థ గానీ మన వద్ద అందుబాటులో లేవని ప్రకటించి వ్యూహాత్మకంగా రాంకీకి చెత్త బాధ్యతలను అప్పగించేందుకు అధికారులు రూపకల్పన చేసిన ప్రణాళికలో భాగమే ఇలా చెత్త కుప్పలుగా పేరుకుపోవటమేనని కొందరు వాదిస్తున్నారు. గతంలో చెత్తను తరలించే విధులు ప్రధాన కార్యాలయంలోని సిటివో కార్యాలయం నేరుగా పర్యవేక్షించేది. కానీ వికేంద్రీకరణ కారణంగా ప్రస్తుతం సర్కిళ్లు, జోన్లలో ఈ విధులను జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఆఫీసర్‌తో పాటు డిఇ, ఇఇలు పర్యవేక్షించాల్సి ఉంది. మరమ్మతుల పాలయ్యే వాహనాలకు వీరు అయిదుగురు కలిసి మంజూరీ ఇస్తే తప్ప మరమ్మతులై, వాహనం బయటకు రాని దుస్థితి ఏర్పడినందుకే సకాలంలో తరలించక చెత్త కుప్పలుగా దర్శనమిస్తోంది.
ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో ‘రాంకీ’ వాహనాలు
పారిశుద్ధ్య విధుల నిర్వహణలో ఇతర రాష్ట్రాల్లో బ్లాక్‌లిస్టులో ఉన్న రాంకీ ఎన్విరో సంస్థతో గతంలో చేసుకున్న ఒప్పందాన్న గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్దం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సోమవారం నగరంలోని యూసుఫ్‌గూడ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు చెత్తను తరలించే రాంకీకి చెందిన అధునాతన వాహనాలొచ్చినట్లు కార్మికులు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం చెత్త సేకరణ, తరలింపు, శాస్ర్తియంగా ల్యాండ్‌ఫీల్ చేసే మొత్తం విధులతో పాటు ఇందుకు సంబంధించి సిబ్బంది, యంత్రాంగం మొత్తాన్ని అధికారులు రాంకీకి అప్పగించాల్సి ఉంటుంది. అయితే రాంకీ సంస్థ అధునాతన వాహనాలను ఎక్కువగా వినియోగించే అవకాశమున్నందున, పారిశుద్ధ్యం విభాగంలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు రాంకీ ఒప్పందం అమలు కార్పొరేషన్‌కు ఆర్థిక భారంగా కూడా మారే అవకాశమున్నందున గతంలో ఈ అగ్రిమెంటును వ్యతిరేకించిన కార్మిక సంఘాలన్నీ ఇపుడు మరోసారి ఒక్కటయ్యేందుకు కార్యచరణను సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.
ప్రజలకు ఆర్థిక భారం
ప్రస్తుతం ఆటో టిప్పర్ల ద్వారా పలు ప్రాంతాల్లో చెత్తను సేకరిస్తున్న కార్మికులకు ప్రతి ఇంటి నుంచి నెలకు రూ. 50 ఛార్జీలుగా అడిగి తీసుకోవాలంటూ అధికారులు వౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కారణంగానే రిక్షా ద్వారా చెత్తను సేకరించే కార్మికులకు, ఆటో టిప్పర్ల డ్రైవర్లకు చాలా చోట్ల గొడవలు తలెత్తున్నాయి. ఒక వేళ అధికారులు రాంకీ ఒప్పందాన్ని అమలు చేస్తే నగరంలో ప్రతి ఇంటి యజమానికి ఇకపై చెత్త ఛార్జీలు కాకుండా అధికారికంగా చెత్త పన్నును చెల్లించే పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయి.