హైదరాబాద్

మహా ‘కౌన్సిల్’లో ఇదీ తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండో పాలక మండలి ఎన్నిక ఆర్భాటంగా, పనితీరు తూతూమంత్రంగా తయారైంది. నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత రెండున్నర నెలల క్రితం ఎన్నికైన కొత్త పాలక మండలిలో ఒకింత స్తబద్దత నెలకొంది. మొత్తం 150 కార్పొరేటర్ సీట్లకు గాను అధికార తెరాస పార్టీ 99 గెల్చుకుని ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఖంగుతినిపించిన ఉత్సాహాం గెలిచిన తర్వాత ఏ మాత్రం కన్పించటం లేదు. ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌కు ఇద్దరు, టిడిపికి ఒకే ఒక్క సభ్యుడు మాత్రమే గెలవటంతో కౌన్సిల్‌లో అధికార పార్టీకి పూర్తిగా బలం సమకూరింది. నగరాభివృద్ధికి, పౌరసేవల నిర్వహణకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, తిరుగులేకుండా ఆమోదం పొందే అవకాశమున్నా, ఆశించిన స్థాయిలో కౌన్సిల్ సమావేశాలు జరగటం లేదు. ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్న గ్లోబల్ సిటీ ప్రతిపాదనలకు ఆమోదం కలగటం లేదు. ఇప్పటి వరకు కనీసం కార్పొరేటర్ల వార్షిక బడ్జెట్‌పై నిర్ణయం గానీ, కౌన్సిల్ అధికారికంగా తీర్మానం గానీ చేయకపోవటంతో కొందరు కార్పొరేటర్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నగరంలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్న కారణంగా నీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతున్నా, ప్రజలకు తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకలేపోతున్నామని కొందరు తెరాస, మజ్లిస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు వాపోతున్నారు. గతంలో 2009లో ఇదే తరహాలో గ్రేటర్‌లో మొట్టమొదటి సారిగా కొలువు దీరిన పాలక మండలికి సంబంధించి డిసెంబర్‌లో జరిగిన మేయర్ ఎన్నిక తర్వాత కొద్దిరోజులకే తదుపరి సమావేశాన్ని నిర్వహించి, కౌన్సిల్ మొత్తం కూడా ఒక్కో కార్పొరేటర్‌కు ఏడా రూ. కోటి రూపాయల బడ్జెట్‌ను ఆమోదించుకున్నారు. కానీ పాలక మండలి అందుబాటులోకి వచ్చి సుమారు రెండున్నర నెలలు పూర్తకావస్తున్నా, ఒక్క మేయర్ ఎన్నిక సమావేశం మినహా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో కౌన్సిల్ సమావేశం జరగలేదు. మేయర్ పదవీ బాధ్యత స్వీకరించిన వెంటనే ప్రకటించిన మొట్టమొదటి కౌన్సిల్ సమావేశం మార్చి 4న జరగాల్సి ఉండగా, నగరానికి ఉప రాష్టప్రతి వస్తుండటంతో వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్ మాసంలో కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు మేయర్ ప్రకటించినా, హైటెక్స్‌లో భవన నిర్మాణ సంస్థల అఖిల భారత సదస్సు కారణంగా అదీ కాస్త మేయర్ వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశాన్ని నిర్వహించినా, కనీసం అధికారపార్టీకి చెందిన సభ్యులు సైతం హజరుకాకపోవటంతో కోరం లేక వాయిదా వేసుకోవల్సిన పరిస్థితి తలెత్తింది. కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పట్ల తెరాస, దాని మిత్రపక్షమైన మజ్లిస్‌ల మధ్య అవగాహన కుదరకపోవటంతోనే మేయర్ సమావేశాన్ని ఎంతో వ్యూహాత్మకంగా వాయిదా వేసినా, కౌన్సిల్ భేటీని మళ్లీ ఎపుడు నిర్వహిస్తారన్నదీ నేటికీ ప్రకటించలేదు. వేసవి కాలం కష్టాలను అధిగమించటంలో భాగంగా ప్రజలకు ప్రత్యామ్నాయంగా తాగునీటిని అందించేందుకు అనేక పనులు చేపట్టాల్సి ఉన్నందున కార్పొరేటర్ బడ్జెట్ ఖరారు, పలు గ్లోబల్ సిటీ ప్రతిపాదనలకు ఆమోదం వంటి ముఖ్యమైన అంశాలపై వెంటనే కౌన్సిల్ నిర్వహించాల్సిన అవసరముందని పలువురు కార్పొరేటర్లు కోరుతున్నారు.