హైదరాబాద్

అభివృద్ధిలో ఆదర్శంగా లష్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మే 2: గ్రేటర్‌లోనే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖామంత్రి టి.పద్మారావు పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని అంబర్‌నగర్‌లో దాదాపు రు.49లక్షలతో సివరేజ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిలకలగూడలోని ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిధులకు వెనుకంజవేయకుండ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నామని అన్నారు. వేసవిలో సైతం మంచినీటి సమస్యలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని దీనిఫలితంగా నియోజకవర్గంలో ఎక్కడ నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తపడ్డామని వివరించారు. లాలాపేట్‌లో రిజర్వాయర్ నిర్మాణం పూర్తికావచ్చిందని, అదేవిధంగా తార్నాకలో కూడ ప్రారంభమవుతుందని తెలిపారు. గత జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు దాదాపు రూ.50కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాయని మంత్రి వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించి ఖర్చుకు వెనుకంజవేయకుండా పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తాము చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని ఇందుకు ఉదాహరణ మొన్నటి జిహెచ్‌ఎంసి ఎన్నికలే నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని, నిధులకు ఎంతమాత్రం కొరత లేదని మంత్రి గుర్తుచేశారు. ఇక నియోజకవర్గంలో ఇరుకుగా మారిన రోడ్ల విషయంలో మంత్రి స్పందిస్తూ ముఖ్యంగా లాలాపేట్, తార్నాక, చిలకలగూడ తదితర ప్రాంతాల్లో రోడ్లను త్వరితగతిన విస్తరిస్తామని పేర్కొన్నారు. లాలాపేట్‌లో 100 అడుగులు, తార్నాకలో 100 అడుగులు, చిలకలగూడలో సైతం 100అడుగుల మేర రోడ్డును విస్తరించడానికి సన్నాహాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రాంతంలో తమ ఆస్తులను కోల్పోతున్న బాధితులకు బాండ్‌లను ఇవ్వనున్నామని తమకు వచ్చిన స్థలంలో నిర్మాణాలు చేపట్టుకోవడానికి వారికి వెసులుబాటు కల్పించడమే దీని లక్ష్యమని అన్నారు. మారుతున్న పరిస్థితులకు కనుగుణంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం తప్పనిసరిగా మారిందని అందుకే ప్రతి ఒక్కరు ఇందుకు సహకరించాలని తెలిపారు. బాధితులు నష్టపోకుండా వారిని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఎంతోకాలం పెండింగ్‌లో ఉన్న ఈ విస్తరణ పనులను త్వరలో చేపట్టనున్నామని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. తరచూ నియోజకవర్గంలో పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని మంత్రి పద్మారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ ధనంజయగౌడ్, వాటర్ వర్క్స్ అధికారులు మహేశ్, దామోదర్‌రెడ్డి, నాగేందర్, కృష్ణ పాల్గొన్నారు.