హైదరాబాద్

క్యాన్సర్ క్రూసేడర్స్ ఇన్విటేషన్ కప్ అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6వ వార్షిక ‘క్యాన్సర్ క్రూసేడర్స్ ఇన్విటేషన్ కప్’ అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్ ఫిబ్రవరి 1, 2 తేదీల్లో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో నిర్వహిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అపోలో క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పీ.విజయ్ ఆనంద్ రెడ్డి, టాలీవుడ్ నటి పూజా హెగ్డేతో కలిసి టోర్నమెంట్ వివరాలు వెల్లడించారు. టోర్నమెంట్‌లో దాదాపు 250 మంది ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. నటి పూజా హెగ్డే మాట్లాడుతూ రియల్ లైఫ్ హిరోలు, హిరోయిన్లు.. వైద్యులని అన్నారు. క్యాన్సర్‌తో బాదపడుతున్న ఇద్దరు పిల్లల చికిత్స కోసం రూ.2.5 లక్షలు విరాళంగా ఇస్తానని, తన మేనేజర్ మరో లక్ష రూపాయలు క్యూర్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నటి పూజా హెగ్డే గోల్ఫ్ క్లబ్‌లో సందడి చేశారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, గోల్ఫ్ సంఘం ప్రతినిధులు జే.విక్రమ్‌దేవ్ రావు, ఎస్.ప్రభాకర్ రెడ్డి, సురేష్ రెడ్డి, కే.శ్రీకాంత్ రావు పాల్గొన్నారు.