హైదరాబాద్

దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ వ్యవహరిస్తున్న విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని మహారాష్ట్ర శాసన సభ స్పీకర్ పటోలే విమర్శించారు. ఆదివారం గోల్కోండ హోటల్‌లో కిసాన్ కాంగ్రెస్ పటోలేకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, నాయకులు వీ.హనుమంత రావు, అనే్వషన్ రెడ్డి, నర్సింహ రెడ్డి, కొందరెడ్డి హాజరై పటోలేను ఘనంగా సన్మానించారు. పటోలే మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన కేంద్ర ప్రభుత్వం, తప్పుడు లెక్కలు చెబుతుందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ప్రజల్లో ఆగ్రహజ్వాలలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగానికి, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తీసుకువస్తున్న చట్టాల వల్లే వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. ఇక అన్నదాతల పరిస్థితి మరింత దారుణంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. అన్నదాతల జీవితాల్లో వెలుగులు నిండాలి, దేశంలో నిరుద్యోగ సమస్య తీరాలని తిరుపతి బాలజీని వేడుకోనున్నట్టు చెప్పారు. దేశానికి అన్నపెట్టే రైతన్నలు ఆకలి అలమటించి ఆత్మహత్యలు చేసుకుంటారని వీ.హనుమంత రావు తెలిపారు. తెలంగాణ రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని, ఇక్కడ రైతుల సంక్షేమం కోసం పోరాడితే అన్నం పెట్టిన చేతులకు బేడీలు వేసి అవమానపరిచారని అన్నారు. రైతుల జరుగుతున్న అన్యాయాలను భరించలేక పటోలే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారని సంపత్‌కుమార్ అన్నారు.