హైదరాబాద్

కంటోనె్మంట్ రోడ్లు మూయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: కంటోనె్మంట్ లోని తొమ్మిది రహదారులను మూసేస్తే నగరం అస్తవ్యస్థం అవుతుందని, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కోరారు. రోడ్లను మూసివేయాలని రక్షణ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టడానికి పూర్తి స్థాయి అధ్యయనం చేసినట్టు కెటిఆర్ తెలిపారు. కంటోనె్మంట్ నుండి ప్రస్తుతం తొమ్మిది మార్గాలు పూర్తిగా మూసివేయడం వల్ల కంటోనె్మంట్ నుండి , వెలుపల నుండి నగరానికి చేరుకునే రహదారులకు అదనపు ట్రాఫిక్‌ను తట్టుకునే పరిస్థితి లేదని స్పష్టమైనట్టు చెప్పారు. ప్రస్తుతం కంటోనె్మంట్ నుండి , వెలుపల నుండి నగరానికి వచ్చే నాలుగు ప్రధాన మార్గాలు ఇప్పటికే తమ రోడ్డు సామర్ధ్యం కన్నా రెట్టింపు ట్రాఫిక్‌ను కలిగి ఉన్నాయి. ఈ మార్గాలు ఇంకా అదనపు ట్రాఫిక్‌ను తట్టుకునే పరిస్థితులు ఏ మాత్రం లేవని, దీని వల్ల ట్రాఫిక్ పూర్తిగా స్తంభించే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కంటోనె్మంట్ ఏరియా సరిహద్దుల నుండి 100 అడుగుల భూమి ఆర్మీ అధికారులు అప్పగిస్తే కొత్తగా రోడ్డును నిర్మించేందుకు కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుందని , అప్పటి వరకు ట్రాఫిక్‌ను యధావిధిగా అనుమతించాలని కెటిఆర్ కోరారు. 1934 నుండి ఈ కంటోనె్మంట్ రోడ్లను సాధారణ ప్రజలు ఉపయోగిస్తున్నారని తెలిపారు. వెంటనే రోడ్లను మూసివేయాలన్న ఆర్మీ అధికారుల నిర్ణయం వల్ల దాదాపు ఐదు లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రమైన అసౌకర్యం కలుగుతుందని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రితో మాట్లాడాలని టిఆర్‌ఎస్ ఎంపి జితేందర్‌రెడ్డికి కెటిఆర్ సూచించారు. ఎఓసి రోడ్ల మూసివేతతో ఈసిఐఎల్ వైపు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన రోడ్లను మూసివేస్తే మరింత ఇబ్బంది తప్పదని కెటిఆర్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తో ఈ అంశంపై చర్చించి రోడ్ల మూసివేతకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాల్సిందని కోరాలని చెప్పారు.