హైదరాబాద్

దివ్యాంగులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: దివ్యాంగులకు యునివర్సల్ గుర్తింపు కార్డులు వెంటనే మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు అడివయ్య డిమాండ్ చేశారు. సికిందరాబాద్ అడ్డగుట్టలో ఎన్‌పీఆర్‌డీ సికిందరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నగర కార్యదర్శి వెంకటేష్, వికలాంగుల మాస పత్రికకు చెందిన పాత్రికేయులు వెంకట్‌తో కలిసి ఈనెల 23న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగనున్న జిల్లా సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. దివ్యాంగులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయింపులో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అంత్యోదయ రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు. రాష్ట్రంలో మహిళా దివ్యాంగులపై అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోతున్నాయని ఆన్నారు. దేశంలో సుమారు 10 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారని, అందులో కనీసం 25శాతం మందికి కూడా పెన్షన్లు రావడం లేదని తెలిపారు. మూడు నెలల నుంచి పెన్షన్లు అందక దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 2016 దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలు కోసం కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణలో 25లక్షల మంది దివ్యాంగులు ఉంటే కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేస్తున్నారని ఆన్నారు.
సమావేశంలో ఎన్‌పీఆర్‌డీ సిటీ కార్యదర్శి ఆర్.వెంకటేష్ పాల్గొన్నారు సమక్షంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సికిందరాబాద్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడిగా దయామణి, కార్యదర్శిగా సరిత, ఉపాధ్యక్షుడిగా వెంకటేష్ గౌడ్, సహాయ కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్, సభ్యులుగా విజయ దశరథ్ పద్మ, ప్రమీల, శ్రీను,రజిని, లక్ష్మి, జమున ఎన్నికైనట్లు నేతలు తెలిపారు.

‘క్రీడలు స్నేహభావాన్ని పెంచుతాయి’
సికిందరాబాద్, జనవరి 21: క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంచడమే కాకుండా ప్రాంతాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని సికిందరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ అన్నారు. ఫిబ్రవరి 16న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగనున్న సౌత్ నేషనల్ కరాటే మేల్ గ్రాండ్ చాంపియన్‌షిప్ కప్‌ను మారేడ్ పల్లిలోని తన నివాసంలో సాయికిరణ్ యాదవ్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వ్యక్తి గతంగా తనకు కూడా క్రీడలంటే ఎంతో ఆసక్తి ఉందని, క్రీడాకారులకు ఉన్నతికి అన్ని విధాల సహకారం అందిస్తానని వెల్లడించారు. నిర్వాహకులు వేణుకుమార్, శోభారాణి, శైలేష్, ఇలియాస్ పాల్గొన్నారు.