హైదరాబాద్

మన తెలంగాణ - మన వ్యవసాయం పేరిట విధ్వంసం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 2: మన తెలంగాణ - మన వ్యవసాయం పేరిట విధ్వంసాన్ని సృష్టించే పంట పద్ధతులను పాటించడం సరికాదని డక్కన్ డవలప్‌మెంట్ సొసైటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సొసైటీ డైరెక్టర్ సతీష్, సోషల్ సైంటిస్ట్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ తెలంగాణ పవిత్ర పేరుతో ఇటువంటి పారిశ్రామిక పంటలను వ్యవసాయదారులపై రుద్దితే అనైతికమని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో భయంకరమైన వ్యవసాయ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని గమనించాలన్నారు. మానవునికి, పశువులకు పోషక ఆహారాన్ని అందించే అద్భుత అవకాశం ఉన్న పంటలకు ఎలాంటి సాగునీరు, ఎరువులు, సర్కారీ విత్తనాలు కాని అవసరం లేకుండా పండే పంటలను మాని ఏక పంట విధానాలతో పండే సోయా, మక్క లాంటి జన్యుమార్పిడికి సిద్దమైన పంటలన్ని కొత్త పేరుతో తీసుకురావడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఇక్కడ వ్యవసాయ పద్ధతులు మారతాయని భావించామని, ఆశించిన స్థాయిలో మార్పులు చోటుచేసుకోక పోగా అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పంటలను పండించడంవల్ల రైతులతో పాటు భూసారం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో ఇటీవల అత్యుత్తమ రైతుగా సన్మానం పొందిన మిరుదొడ్డి వినోద తన మూడెకరాల భూమిలో సాగునీరు, సర్కారి మందులు, ఎరువులు వాడకుండా అద్భుతంగా పండించిన విధానాన్ని వివరించింది. తాను పాటించిన విధానంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్ధితి రానేరాదని, ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి జరిగే మేలును న్యూట్రిషనిస్ట్ హైమవతి వివరించారు.
కరువు నివారణ చర్యలు చేపట్టాలి