హైదరాబాద్

బోస్ పోరాట పటిమ అద్వితీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: స్వాతంత్య్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ పోరాట పటిమ అద్వితీయమని సీతాఫల్‌మండి కార్పొరేటర్ సామల హేమ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సికిందరాబాద్ వారాసిగూడ చౌరస్తాలోని నేతాజీ విగ్రహానికి నేతాజీ స్కూల్ విద్యార్థులు, స్థానిక టీఆర్‌ఎస్, బీజేపీ నేతలతో కలిసి సీతాఫల్‌మండి కార్పొరేటర్ సామల హేమ పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపి సీనియర్ నేతలు రవిప్రసాద్ గౌడ్, సారంగపాణి, హరి, టీఆర్‌ఎస్ నేతలు గడ్డం అశోక్, కరాటే రాజు, జాకీర్, నేతాజీ స్కూల్ ప్రిన్సిపాల్ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీలకతీతంగా నాయకులందరూ విద్యార్థులతో కలసి సుభాష్ చంద్రబోసు విగ్రహానికి నివాళి అర్పించారు.
నేతాజీ జయంతిని పురస్కరించుకుని అడ్డగుట్ట డివిజన్, తుకారాంగేట్‌లో కూడా నేతలు నివాళి అర్పించారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి స్థానిక నేతలు ఏఎల్ రాజేశ్వర్, నాగేష్, ప్రకాష్ ఆధ్వర్యంలో నేతలు, కుల సంఘాల నేతలు, ప్రజలు పూలమాల వేసి సేవలను స్మరించుకున్నారు. మిఠాయిలు, పండ్ల పంపిణీ చేశారు. కాంగ్రెస్ నేతలు శాస్ర్తీ, ఘంటా రాజు సాగర్, అశ్విన్, సత్యం, అంటోనీ, గోపి పాల్గొన్నారు.