హైదరాబాద్

సేఫ్ సిటీ ప్రాజెక్టుకు నగరం ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సేఫ్ సిటీ ప్రాజెక్టుకు హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన పనులపై ఇద్దరు కమిషనర్ల ఆధ్వర్యంలో మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా, పోలీసు అధికారుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జంక్షన్ల అభివృద్ధి, ప్రత్యేకంగా పోల్స్ ఏర్పాటు చేసి వాటిపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే పనులపై, రోడ్డు కిట్టింగ్‌లపై ప్రత్యేకంగా చర్చించారు. మే 15 తర్వాత నగరంలో ఎక్కడా కూడా రోడ్ కట్టింగ్‌లకు అనుమతిచ్చేది లేదని బల్దియా కమిషనర్ వెల్లడించారు. సీసీ టీవీలు, కెమెరాల ఏర్పాటుకు రోడ్ కట్టింగ్ జరిగిన 48 గంటల్లోపు పనులు పూర్తయి, రోడ్ల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు సిద్దంగా ఉండాలని నిర్ణయించారు. ఈ పనుల్లో భాగంగా పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయగానే వెంటనే రోడ్డు పునరుద్దరణ పనులను చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ కింది స్థాయి అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ కింద జంక్షన్లలో సీసీ టీవీల ఏర్పాటుకు మూడు దశల్లో ఎల్ అండ్ టీ సంస్థ 2662 జంక్షన్లలో రోడ్ కట్టింగ్‌కు అనుమతుల కోసం దరఖాస్తులు పెట్టుకోగా, 2557 జంక్షన్లలో పనుల కోసం అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ రోడ్ కట్టింగ్ విస్తరణ సుమారు 59 కిలోమీటర్ల పొడువున ఉంటుందని వెల్లడించారు. నెట్‌వర్క్ ఏర్పాటుకు రిలయెన్స్ జియో 1077 జంక్షన్లలో మెక్రో కట్టింగ్‌లకు అనుమతులు కోరగా, మొదటి విడతగా 493 చోట్ల సుమారు 26 కిలోమీటర్ల పొడువున రోడ్ కట్టింగ్‌కు అనుమతించినట్లు తెలిపారు. రిలయెన్స్ జియో ఏజెన్సీ సీసీ కెమెరాలకు 5280 పోల్స్ ఏర్పాటుకు 221 మీటర్ల పొడువున రోడ్ కట్టింగ్‌కు అనుమతించామని తెలిపారు. సమావేశంలో భాగంగా వీది వ్యాపారులకు లోకేషన్ లింకుతో గుర్తుంపు కార్డుల జారీ వంటి అంశాలపై చర్చించారు. ఈ లొకేషన్లలో 533 చోట్ల ఇప్పటికే నెట్‌వర్క్ కనెక్షన్లు ఉంటే , కొత్తగా నెట్‌వర్క్ ఏర్పాటుకు 297 లొకేషన్లలో 5.79 కిలోమీటర్ల పొడువున మైక్రో కట్టింగ్ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో బల్దియా చీఫ్ ఇంజనీర్లు జియావుద్దిన్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, రాచకొండ అదనపు కమిషనర్ సుధీర్‌బాబు, ట్రాఫిక్ డీసీసీ దివ్య చరణ్, ట్రాఫిక్ డీసీపీ విజయకుమార్, సిటీ ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ బల్దియా జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.