హైదరాబాద్

చిత్రకళలకు విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: చిత్రకళలకు విస్తృతమైన ప్రచారం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రముఖ చిత్రకారిణి రూప రూపొందించిన చిత్ర ప్రదర్శన శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్స్ గ్యాలరీలో ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిరంజన్ రెడ్డి పాల్గొని చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. సమాకాలిన సమాజంలో చిత్రకారులు వారి పాత్రలను పోషించారని వివరించారు. రూప రూపొందించిన చిత్రాలలో మానవీయ విలువలను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. రూప కేవలం చిత్రాల వరకే పరిమితం కాకుండా సంగీతంతో పాటు రచనలు చేశారని తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్టల్రలో తన రూప చిత్ర ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని అకాక్షించారు. తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ రూప చరిత్ర ప్రసిద్ధి చెందిన మహనీయుల చిత్రాలను రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహా రెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి చెన్నయ్య పాల్గొన్నారు.

మృదు మధుర గాన మాధురి
రేవతి రత్నస్వామి
కాచిగూడ, ఫిబ్రవరి 22: మృదు మధుర గాన మాధురి చిత్తూరి రేవతి రత్నస్వామి అని తెలంగాణ రాష్ట్ర హెల్త్ అండ్ మెడికల్ ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ అధికారి ఏ.శాంతి కుమారి అన్నారు. సుబ్రమణ్య సంగీత క్షేత్ర, కల్పన కళానికేతన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో రేవతి రత్నస్వామి శిష్య బృందం ‘కర్నాటక సంగీతాంజలి’ శనివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాంతి కుమారి పాల్గొని గాయకులను అభినందించి సత్కరించారు. రత్నస్వామి వారసత్వ సంగీతంలో అద్భుతమైన మెళకువలు నేర్చుకుని వాటిని ఆచరణలో పెట్టడమే కాకుండా ఎన్నో వేలమంది శిష్యులకు వారి పాఠాంతరాన్ని సరియైన పద్ధతిలో నేర్పించి విజ్ఞానాన్ని పెంపొందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్పన కళానికేతన్ అధ్యక్షుడు జంగయ్య గౌడ్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ‘నాట్యాంజలి’
కాచిగూడ, ఫిబ్రవరి 22: భాగ్యనగర్ నాట్యాంజలి ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ నృత్యోత్సవం’లో భాగంగా కథక్, ఒడిసీ, కూచిపూడి నృత్య ప్రదర్శనలు శనివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ నృత్య గురువు డా.అనురాధ వెంకట కృష్ణ, డా.సత్యవతి, శ్రీపతి బాల సరస్వతి పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. సంస్థ అధ్యక్షురాలు భాస్కర కళా సామ్రాజ్యం పాల్గొన్నారు.