హైదరాబాద్

మీరు చేయగలరా? చైనా సంస్థలను పిలవాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట కల్గించటంతో పాటు సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డీపీ పనులన్నీ అక్టోబర్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు అధికారులకు డెడ్‌లైన్ విధించారు. పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి నగరంలో ఎస్‌ఆర్‌డీపీ కింద నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు ఎందుకు ఆలస్యంగా జరుగుతున్నాయన్న విషయాన్ని అడిగి తెల్సుకున్నారు. స్థల సేకరణకు క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు చెప్పిన సమాధానానికి మంత్రి ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. చైనాలో కేవలం పది రోజుల్లోనే ఆసుపత్రి నిర్మించారని, మరి ఇక్కడెందుకు మీరు నిర్ణీత గడువులోపు భూ సేకరణ, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మించలేకపోతున్నారని చురకలు పెట్టినట్లు సమాచారం. మీరు సక్రమంగా పనిచేయకపోతే చెప్పండి, చైనా సంస్థలను ఇక్కడకు పిలుద్దామా? లేక మీరే అక్కడకు వెళ్తారా? అంటూ చురకలు పెట్టారు. ప్రస్తుతం చైనాలో కోవిడ్ 19 వైరస్ ఉందని, తాము అక్కడికి వెళ్లలేమని అధికారులు చెప్పారు. ముఖ్యంగా 2015 స్థల సేకరణ చట్టాన్ని అమలు చేస్తూ, వీలైనంత త్వరగా తాము స్థలాలను సేకరించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఫలించటం లేదని అధికారులు సమాధానం చెప్పారు. అంతేగాక, భూ సేకరణ చేసి, యజమానులకు నష్టపరిహారం కింద టీడీఆర్‌లు ఇస్తామన్నా, యజమానులు అంగీకరించటం లేదని, పైగా మన నగరంలో రోడ్లపైనే వివిధ వర్గాలకు చెందిన ప్రార్థన మందిరాలు, స్మశానవాటికలను తొలగించేందుకు అనేక రకాల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయని అధికారులు చెప్పిన సమాధానానికి మంత్రి అంగీకరించలేదు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే అడ్డంకులు, వాస్తవంగా భిన్నమైన పరిస్థితులు నెలకొన్నందున, తామెలా పనులు చేయాలంటూ అధికారుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది.
నిధులు, సిబ్బంది, అధికారుల కొరత వంటి అనేక సమస్యలున్నాయంటూ అధికారులు చెప్పినా, విన్పించుకోని మంత్రి కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ మాసం కల్లా ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశ కింద చేపట్టిన అన్ని రకాల ప్రాజెక్టుల పనులు పూర్తి కావల్సిందేనని డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో బల్దియాకు సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుందా? అన్న వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోందని చెప్పవచ్చు.