హైదరాబాద్
ఇళ్లకే పరిమితమైన జనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఖైరతాబాద్: కోవిడ్-19 అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నిత్యం బిజీగా గడిపే నగర ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కొద్దిపాటి సమయం దొరికితేనే ఫోన్లను చూసుకునే ప్రజలు 24 గంటల పాటు ఎటూ పోలేని పరిస్థితి నెలకొనడంతో ఫోన్లకే అతుక్కుపోయారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే సందేశాలు, వీడియోలను చూస్తూ వాటిని ఇతరులకు ఫార్వాడ్ చేయడంలో బీజీగా మారారు. స్నేహితులు, బంధువులకు వీడియోకాల్స్ చేసి క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. టీవీలు అందుబాటులో లేని యువత క్షణ క్షణం వచ్చే అప్‌డేడ్స్‌ను తెలుసుకునేందుకు యూట్యూబ్‌లో వార్త చానల్స్‌ను వీక్షించారు. గతంలో ఎన్నడూలేని విధంగా నగరవ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగం భారీగా పెరిగింది.
చిలకలగూడలో..
జనతా కర్ఫ్యూలో బాగంగా చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అవగాహన కార్యక్రమంలో నార్త్‌జోన్ డీసీపీ కలమేశ్వర్ పాల్గొని సిబ్బందితో కలసి ప్లకార్డులు ప్రదర్శించారు. ఇన్‌స్పెక్టర్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సిబ్బంది చిలుకలగూడ కూడలిలో పలు అపార్ట్‌మెంట్ వాసులు తమ తమ బాల్కనీలలో నిలబడి చప్పట్లతో, వివిద శబ్దాలతో వైద్యులకు సంఘీభావం తెలిపారు. గాంధీ ఆసుపత్రి ఆవరణలో మిగతా సిబ్బంది, గాంధీ సెక్యూరిటీ సిబ్బందితో కలసి సంఘీభావ చప్పట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.
నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస రావు తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలో ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలతో కలసి చప్పట్లతో వైద్యులకు సంఘీభావం తెలిపారు. గోపాల పురం ఏసీపీ వెంకటరమణ ఆద్వర్యంలో సికిందరాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నార్త్ జోన్ పోలీసులు చప్పట్లతో వైద్యులకు సంఘీభావం తెలిపారు. రోడ్లపై జనాలు కనపడకుండా ఎప్పటికప్పుడు పోలీసులు కంట్రోల్ చేశారు.
ఇన్‌స్పెక్టర్ మట్టయ్య ఆధ్వర్యంలో పోలీసులు మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోని రెండవ లక్ష్మినగర్, శోభన కాలనీ, జేబీఎస్, పికెట్ ప్రాంతలలో జనతా కర్ఫ్యూను పర్యవేక్షించడంతో పాటు ప్రజలలో అవగాహన తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.