హైదరాబాద్

కాస్త ఆలస్యమైనా ఆదరణ అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: గ్రేటర్ పరిధిలోని అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సర్కారు ప్రవేశపెట్టిన క్రమబద్ధీకరణకు కాస్త ఆలస్యమైనా, క్రమంగా ఆదరణ పెరుగుతోంది. సర్కారు భవనాలు, అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు బిఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ స్కీంలను ప్రవేశపెట్టిన 19 రోజుల్లో అన్ని సర్కిళ్లలో కలిపి సుమారు 27629 దరఖాస్తులు అందాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మొత్తం క్రమబద్ధీకరణ ప్రక్రియలోనే ఎక్కడా కూడా అవినీతి, మధ్యవర్తులు, దళారులకు తావివ్వకుండా ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు సమర్పించాలన్న నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే!
దీంతో పథకాలను ప్రవేపెట్టిన కొత్తలో అధికారులు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. పైగా అన్ని సర్కిళ్లలోనూ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు వీలుగా ఐటి సర్వర్ల సామర్థ్యాన్ని కూడా పెంచకపోవటంతో ఒక సర్కిల్‌లో రోజుకి కేవలం నాలుగు నుంచి అయిదు దరఖాస్తులు మాత్రమే వచ్చేవి. కానీ ఆ తర్వాత అన్ని సర్కిళ్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయటం, అదే విధంగా జిహెచ్‌ఎంసి లైసెన్సు పొందిన ఆర్కిటెక్చర్ల వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో పెట్టడంతో క్రమంగా దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. శనివారం సాయంత్రం వరకు లే అవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి 8601, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ కోసం మరో19వేల 28 దరఖాస్తులొచ్చాయి. ఇందులో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ద్వారా గ్రేటర్‌కు ఇప్పటి వరకు సుమారు రూ. 5 కోట్ల 73లక్షల 41వేలు, అలాగే బిపిఎస్ దరఖాస్తుల ద్వారా రూ. 12 కోట్ల 25లక్షల 87వేల వరకు ఆదాయం సమకూరింది. అయితే దరఖాస్తుల స్వీకరణ ఈ నెలాఖరుతో ముగిసేందుకు ఇంకా కేవలం పదిరోజులు మాత్రమే గడువు ఉన్నందున, మరో ఇరవై నుంచి 30వేల వరకు దరఖాస్తులొస్తాయని అధికారులు భావిస్తున్నారు. గతంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారులు సర్కారుకు సమర్పించిన నివేదిక ప్రకారం 50 వేల నుంచి 60 వేల వరకు అక్రమ నిర్మాణాలుండగా, ఇప్పటి వరకు 27వేల పై చిలుకు దరఖాస్తులు రాగా, మరో పదిరోజుల గడవులో మరో 20 నుంచి 25వేల దరఖాస్తులొచ్చే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని క్రమబద్ధీకరిస్తే గ్రేటర్‌కు సుమారు రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అధికారుల లక్ష్యం 500 కోట్ల వరకు ఉందని అధికారులు వెల్లడించారు.
గడువు పెంపుపై కసరత్తు
బిపిఎస్, ఎల్‌ఆర్‌ఎస్ స్కీంలకు సంబంధించి ఈ నెలాఖరుతో గడువు ముగియనుండటం, సర్కారు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవటంతో గడువు పెంచుతారన్న వాదనలు విన్పిస్తున్నాయి. కానీ మహానగర పాలక సంస్థ అధికారులు మాత్రం గడువు పెంచాలని కోరుతూ తామేమీ లేఖలు రాయలేదని తేల్చి చెబుతున్నారు. కానీ గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సర్కారు గడువు పెంచవచ్చునన్న వాదనలూ ఉన్నాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నియామవళి అమల్లో ఉన్నందున, ఇప్పట్లో ప్రకటన చేసే అవకాశం లేదు. ఈ నెలాఖరుతో గడువు ముగియనున్నందున వచ్చే నెల 1వ తేదీ తర్వాతే గడువు పెంచాలా? లేదా? అన్న విషయంపై సర్కారు కసరత్తు చేస్తోన్నట్లు తెలిసింది.