హైదరాబాద్

వర్షం కురిసిన రాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: రికార్డు స్థాయిలో ఎండలు మండుతున్న సమయంలో ప్రతిరోజు సాయంత్రం కరుణించిన వరుణుడు శుక్రవారం తెల్లవారుఝామున కనె్నర్ర చేశాడు. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో రెండున్నర గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షం నగరంలో బీభత్సాన్ని సృష్టించింది. కారణంగా వందల సంఖ్యలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల హోర్డింగులు విరిగిపడ్డాయి. ఉదయం వర్షం ఆగిన తర్వాత సహాయక చర్యల నిమిత్తం రంగంలోకి దిగిన వివిధ ప్రభుత్వ విభాగాలు తూతూమంత్రంగా చర్యలు చేపట్టాయి. ఫలితంగా తొమ్మిది గంటల నుంచి నిత్యం రద్దీగా ఉండే జంక్షన్లు, కూడళ్లలో భారీగా నిలిచిన వర్షపు నీటితో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులెదురయ్యాయి. బలమైన గాలులతో కురిసిన వర్షం కారణంగా పలు చోట ఇళ్లు, హాస్టళ్ల పై కప్పులు ఎగిరిపోగా, మరికొన్ని చోట్ల మురికివాడలు, అపార్ట్‌మెంట్లలోకి నీరు ప్రవహించింది. పలు చోట్ల మహావృక్షాలు నేలకొరగటంతో వాటి కింద పార్కింగ్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం నగరంలో సుమారు 7.9 సెం.మీ.ల వర్షం కురిసిందని, ఇందులో అత్యధికంగా బేగంపేటలో కురిసినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు వెల్లడించారు.