హైదరాబాద్

అందని కందిపప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, డిసెంబర్ 20: గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు సబ్సిడీ కందిపప్పు సరఫరా కావడం లేదు. టెండరు ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఈ నెల కందిపప్పు గోదాములకు చేరలేదు. బహిరంగ మార్కెట్‌లో దీని ధర చుక్కలను తాకుతుండటంతో సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి సబ్సిడీ కందిపప్పు టెండర్లు ఖరారు చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.180 పలుకుతుండగా చౌకధరల దుకాణాల ద్వారా సబ్సిడీపై రూ.50కే ప్రభుత్వం అందిస్తోంది. ఇటీవల వరకు దీనికి పెద్దగా డిమాండ్స్ ఉండేది కాదు దీంతో గోదాముల నుంచి కోటాను తీసుకెళ్లేందుకు డీలర్లు ఆసక్తి చూపేవారు కాదు. ప్రస్తుత పరిస్థితి మారింది గత రెండు నెలలుగా పూర్తిస్థాయి కోటాకోసం డీడీలు కట్టి ఇండెంట్ పెట్టి, డీలర్లు ఎదురు చూస్తున్నారు. తాజాగా టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో సరఫరాకు చెక్‌పడింది.
ఇదీ పరిస్థితి
గ్రేటర్‌లోని మొత్తం 12 పౌరసరఫరాల శాఖ సర్కిల్స్‌లో 14 లక్షల కార్డుదారులున్నారు. చౌకధరల దుకాణాల ద్వారా ప్రతినెలా ఒక్కో కార్డుదారుడికి కిలో కందిపప్పు రూ.50ల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఈ నెలలో హైదరాబాద్‌లోని తొమ్మిది సర్కిళ్లకు 819 మెట్రిక్ టన్నులు, రంగారెడ్డి జిల్లా అర్బన్‌లో మూడు సర్కిల్స్‌కు 581 మెట్రిక్ టన్నుల కందిపప్పును అధికారులు కేటాయించారు కాని ఇప్పటివరకు సరఫరా కాలేదు.
70 శాతం పక్కదారి
మరోవైపు సబ్సిడీ కందిపప్పు డీలర్లకు కాసులు కురిపిస్తోంది. గత నెలలో గ్రేటర్ హైదరాబాద్‌లోని రేషన్ షాపులకు 1,393 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. అందులో కనీసం 30 శాతం కూడా పంపిణీకి నోచుకోలేదు. క్షేత్రస్థాయి నిఘా కొరవడి 70 శాతంకు పైగా సబ్సిడీ కందిపప్పు నల్లబజారుకు తరలుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.