హైదరాబాద్

బడుగు వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ దృఢ సంకల్పంతో వున్నారని తెలంగాణ హోంశాఖా మంత్రి నాయని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సంత్‌గాడ్గే బాబా మహారాజ్ వర్ధంతి సందర్భంగా ‘వీరనారి చాకలి ఐలమ్మ పోరాట చరిత్ర - ప్రభుత్వ ప్రాధాన్యత’ అనే అంశంపై జరిగిన సమినార్‌కు నాయని నర్సింహారెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. పాలకుర్తి మార్కెట్ యార్డ్‌కు చాకలి ఐలమ్మ పేరు పెట్టాము ఇంకా గుర్తింపు రావాలనీ గత ప్రభుత్వం చాకలి ఐలమ్మ చరిత్ర బయటకు రానీయకుండా తొక్కేసారని ఆయన అన్నారు. విముక్తి ఉద్యమాలకు వేగుగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటుచేయడానికి, వర్ధంతి జయంతి సభలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించిన ఫైల్ కెసిఆర్ వద్దకు వెళ్లిందని త్వరలోనే ఆమోదం పొందుతుందని నాయని అన్నారు. రజకుల సమస్యల పరిష్కారం గురించి సంఘం తరఫున వినతిపత్రంతో వస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గరకు తీసుకు వెళ్తానని నాయని నర్సింహారెడ్డి అన్నారు.
తొలుత సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని అన్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన దోబి పనులు రజకులకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగరరావు మాట్లాడుతూ రజకులకు సమాజంలో సముచిత స్థానం వుండాలని అన్నారు. కార్యక్రమంలో విఎస్‌ఆర్ శీను కూడా పాల్గొన్నారు.

డాక్టర్ సూర్యప్రకాష్‌కు ఎఎఫ్‌ఎ వైద్యరత్న పురస్కారం

ఖైరతాబాద్, డిసెంబర్ 20: వైద్యరంగంలో విశేషసేవలందించినందుకు ప్రముఖ హృద్రోగనిపుణులు డాక్టర్ గుళ్ల సూర్యప్రకాష్ అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఎఎఫ్‌ఎ) అంతర్జాతీయ వైద్యరత్న బిరుదును ప్రదానం చేసి సన్మానించింది. ఆదివారం ఫిలింనగర్ కల్చర్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో అక్కినేని కుమార్తె నాగసుశీల సూర్యప్రకాష్‌కు బిరుదును అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురస్కారాలు అందిస్తున్నట్టు చెప్పారు. వైద్యరంగంలో తనకుంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ సూర్యప్రకాష్‌కు పురస్కారాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వివిధ గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తూ అనేకమంది రోగులకు సూర్యప్రకాష్ సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. కేవలం శస్తచ్రికిత్సలకే పరిమితం కాకుండా పేదరోగులకు ఉచితంగా మందులు అందించే ఔదార్యం ఆయనదని అన్నారు. ఇదే కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు విద్యారత్న పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.