హైదరాబాద్

ఆనందోత్సాహాలతో ‘ఐ-్ఫకస్’ సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: ఆనందించు... ఆనందాన్ని పలువురికి పంచు... అంటూ ఆనందోత్సాహాలతో యువత కేరింతలతో ఐ-్ఫకస్ సంబరాలు కళా ప్రాంగణంలో మారుమోగాయి. సద్గురు శ్రీ శివానందమూర్తి దిశానిర్దేశంలో నడుస్తున్న ఐ-్ఫకస్ గత 10 సంవత్సరాలుగా ప్రజలలో చైతన్యం నింపుతూ, వారిని వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేసుకునే విధంగా తీర్చిదిద్దుతోంది. కుటుంబ వ్యవస్థ బలపడటానికి, పాజిటివ్ దృక్పథంతో కూడిన అందమైన భవిష్యత్ కోసం, వ్యక్తిగత సమర్థత పెంచుకోవడానికి ఓటర్ ఫోకస్, మైత్రీ వారధి, గోగ్రీన్ ఫర్ గణేష మరియు ఇతర కార్యక్రమాలు ఐ-్ఫకస్ నిర్వహిస్తోందని తెలుపుతూ ఐ-్ఫకస్ 10వ వార్షికోత్సవ సంబరాలు ఆదివారం సాయంత్రం నాంపల్లిలోని లలిత కళాతోరణంలో ఘనంగా జరిగాయి. సమర్థత, సమగ్రత మూర్త్భీవించిన యువత ధైర్యానికి ప్రతీకగా వుండాలని ఐ-్ఫకస్ సూచిస్తోందని, 10 ఏళ్ళ ప్రస్థానం గురించి,విధి విధానాల గురించి సంస్థ చీఫ్ కో-ఆర్డినేటర్ వాసుదేవ శర్మ తెలిపారు. ‘‘స్వేచ్ఛగా, ధైర్యంగా నవ్వగలిగే యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉందని, అలాంటి యువతను వేలాది మందిగా కలిగిన ఐ-్ఫకస్ సంస్థ జాతి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుందని’’ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. వేలాదిమంది ఐ-్ఫకస్ సభ్యులు ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సినీ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆకెళ్ల రాఘవేంద్రరావు తదితర సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.