హైదరాబాద్

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: ఏ ప్రాంతంలోనైనా విద్యాలయాలు అభివృద్ధి చెందగలిగితేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ ఆలి అన్నారు. అగర్వాల్ శిక్షా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం రవీంద్రభారతిలో గణేష్‌లాల్ కటోడియా ప్రాథమిక పాఠశాల, లీలాబాయి మోతీలాల్ హైస్కూలు వార్షికోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న మహమూద్ ఆలి మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ సైంటిస్ట్ కాగలిగినా, రాష్టప్రతిగా ఎదిగినా అన్నిటికీ విద్యే కారణమని అన్నారు. పాతనగరాన్ని అభివృద్ధి చేసి బంగారు నగరంగా మారుస్తామని ఆయన అన్నారు. పాతనగరాన్ని అభివృద్ధిచేసి బంగారు నగరంగా మారుస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో మెట్రో పనులు చెయ్యగలుగుతున్నామంటే ఆ పరిజ్ఞానమంతా విద్యతోనే వచ్చిందని అందుకే అందరికి విద్య అందుబాటులో వుండాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ కెజి టు పిజి ఉచిత విద్యను ప్రవేశపెట్టారని మహమూద్ ఆలి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్లానింగ్ కమీషన్ ఉపాధ్యక్షులు ఎస్.నిరంజన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. తొలుత అశోక్ చంద్ అగర్వాల్ స్వాగతం పలికారు.