హైదరాబాద్

1 నుంచి మరిన్ని ఆన్‌లైన్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: జంటనగరవాసులకు ఆన్‌లైన్‌లో మరిన్ని సేవలందించేందుకు జిహెచ్‌ఎంసి సిద్ధమవుతోంది. 1వ తేదీ నుంచి భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ల అనుమతులను పూణే నగర పాలక సంస్థ మాదిరిగా ఆన్‌లైన్‌లో ఆమోదించే సరికొత్త విధానాన్ని పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ల అనుమతుల జారీలో మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా, దరఖాస్తుదారులను సిబ్బంది అమ్యామ్యాలకు డిమాండ్ చేయకుండా ఉండేందుకు ఈ సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పూణే నగర పాలక సంస్థ అమలు చేస్తున్న డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(డిపిఎంఎస్) అనే ఆన్‌లైన్ అప్రూవల్ సిస్టమ్‌ను గ్రేటర్ ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు గాను పూణేకు చెందిన సాఫ్ట్‌టేక్ అనే సంస్థ జిహెచ్‌ఎంసి కోసం సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిహెచ్‌ఎంసి అధికారులు గత 6వ తేదీన సికిందరాబాద్ హరిహరకళాభవన్‌లో ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు, సిబ్బంది, అధికారులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు. దీంతో పాటు ఆర్కిటెక్చర్లు, ఇంజనీర్లు, లైసెన్సు కల్గిన సర్వేయర్లకు ఈ నెల 6నే గాక, 9 నుంచి 12వరకు, అలాగే 16 నుంచి 19వరకు, అలాగే ఈ నెల 24 నుంచి 27వరకు తుది దశగా శిక్షణనివ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎలా వినియోగించాలి?
పూణేకు చెందిన సాఫ్ట్‌టెక్ కన్సల్టెంట్ రూపకల్పన చేస్తున్న ఆన్‌లైన్ అప్రూవల్ సిస్టమ్ డిపిఎంఎస్‌ను వినియోగించాల్సిన తీరుపై శిక్షణనిస్తున్నారు. 1వ తేదీ నుంచి ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు, లైసెన్సు కల్గిన సర్వేయర్లు సిస్టమ్ నుంచి డిసిఆర్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తూ ఆటోక్యాడ్ ఫార్మెట్‌లో తమ ప్లాన్లను అప్‌లోడ్ చేయాలి. భవన నిర్మాణ అనుమతులకు గానీ, లే అవుట్ల అనుమతులకు సంబంధించి దరఖాస్తుదారుడు కార్యాలయానికి రాకుండా, అధికారులను కలవకుండానే గానీ ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా అప్రూవల్ కానున్నట్లు తెలిపారు. ఈ విధానం అమల్లోకి రానున్న 1వ తేదీ నుంచి మ్యానువెల్‌గా ప్లాన్ల స్వీకరణ ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు.