హైదరాబాద్

నేడు వైకుంఠ ఏకాదశి ఆలయాల ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, వైష్ణవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా దేవాలయాల నుంచి ఎగ్జిక్యూటివ్ అధికారులను, ఇతర ఉద్యోగులను ఆ దేవాలయాలకు ఇన్‌ఛార్జ్జిలుగా అదనంగా నియమించారు. కీసర దేవాలయం ఎగ్జిక్యూటివ్ అధికారి (అసిస్టెంట్ కమిషనర్) టంకశాల వెంకటేష్‌ను ప్రభుత్వం బంజారాహిల్స్‌లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా అదనపు బాధ్యతలతో నియమించింది. మంత్రులు, ఇతర వివిఐపిలు, విఐపిలు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. చిక్కడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆ దేవాలయానికి ఎగ్జిక్యూటివ్ అధికారిగా సంధ్యా రాణి ఉన్నారు. అయినా భక్తుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ మహంకాళి దేవాలయానికి చెందిన ఉద్యోగి వెంకటేష్‌ను నియమించింది.
ఇలాఉండగా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించుకుంటే ఏకంగా స్వర్గానికి వెళతారన్న ప్రతీతి. అందుకే భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున కుటుంబ సమేతంగా ఆలయాలకు ఉత్తర ద్వారం నుంచి వెళతారు. జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయాన్ని సుందరంగా అలంకరించి, మెరుమిట్లుగొలిపే విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. గడ్డిఅన్నారం, తిరుమల హిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు. ఇంకా యాదాద్రి (యాదగిరిగుట్ట)లో ఉదయం 6.42 నుంచి 7.30 గంటల వరకు ఉత్తర ద్వారం నుంచి ప్రవేశం కల్పించారు. తిరుమలలో ఆదివారం రాత్రి నుంచే అంటే తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 4 గంటల వరకు వివిఐపిల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు.