హైదరాబాద్

రాష్ట్ర ఆవిర్భావ సంబరాలకు నగరం ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ముఖ్యంగా నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వచ్చే నెల 2న జరిగే రాష్ట్ర ఆవిర్బావ ఉత్సవాలకు ట్యాంక్‌బండ్ ప్రాంతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారనుంది. ట్యాంక్‌బండ్ చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న సచివాలయం, జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం, అసెంబ్లీ భవనాలకు ముస్తాబు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
జూన్ రెండో తేదీన హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఏ)కు చెందిన అన్ని పార్కుల్లో సందర్శకులను ఉచితంగా అనుమతించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ విభాగాలు శాఖల వారీగా ఈ సంబరాలను నిర్వహించాలని ఇప్పటికే కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, సర్కారు ఆసుపత్రుల్లో పండ్లు, స్వీట్లను పంపిణీ చేయటంతో పాటు పేదలు ఎక్కువగా నివసించే మురికివాడల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి, పేదలకు వైద్యం అందించాలని కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, హాస్పిటల్స్ సర్వీసెస్ జిల్లా కో ఆర్డినేటర్ సంయుక్త్ధ్వార్యంలో వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ కు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, కలెక్టరేట్ కార్యాలయాన్ని ఇతర ఆఫీసులను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఎలక్ట్రిక్, రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. పాఠశాల, జూనియర్, డిగ్రీ, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తృత్వం, క్రీడలు, ఆటలు తదితర పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రధానం చేయాలని, ఆయా పాఠశాలల విద్యార్థులతో ర్యాలీలు, రన్స్ వంటి కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక శకటాన్ని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రజలకు అందించే సేవలను ప్రతిబింబించేలా ఈ శకటం ఉండేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.