హైదరాబాద్

మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నడుం బిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 27: మహిళల అక్రమ రవాణను అడ్డుకునేందుకు అంతా నడుం బిగించాల్సి ఉందని ప్రజ్వలా సంస్థ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో యూఎస్ కాన్సొలేట్ ప్రతినిధి మైకేల్‌తో కలిసి ఆమె మాట్లాడారు. బాలికలు, స్ర్తిల అక్రమ రవాణ సరిహద్దులు దాటి అన్ని దేశాల్లో కొనసాగుతున్న అతి పెద్ద సమస్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లు పైబడ్డ చిన్నారులను పాఠశాలల వద్ద మాటువేసి ఇతర ప్రాంతాలకు తరలించే ముఠాలు ఉన్నాయని అన్నారు. ఈ తరహా ట్రాఫికింగ్‌కు గురౌతున్న వారిని రక్షించేందుకు ప్రజ్వల సంస్థ పనిచేస్తుందని చెప్పారు. ఉమెన్ ట్రాఫికింగ్‌పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు యూస్ కాన్సొలేట్, తెలంగాణ, ఏపి, ఒరిస్సా ప్రభుత్వాల సహకారంతో జనవరి 9న చైతన్య యాత్రను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ చైతన్య యాత్రల్లో భాగంగా బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన స్ర్తిలు, బాలికలు ఎలాంటి ఇబ్బందులకు గురౌతున్నారో కళ్లకు కట్టినట్టు వివరిస్తామన్నారు. ఇలాంటి కార్యక్రమాల సమయంలో ఈ విధంగా తప్పులు చేసినవారు కంటతడి పెట్టుకుంటూ మరోసారి ఇలా చేయమంటూ తమ వద్దకు వచ్చారని తెలిపారు. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో తమ కార్యక్రమాలు కొనసాగాయని, వీటిని దేశవ్యాప్తంగా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.