హైదరాబాద్

గ్రేటర్ కౌన్సిల్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: మహానగర పాలక సంస్థ నగరంలో చేపట్టే అభివృద్ధి పనులు, పౌరసేవల నిర్వహణ వంటి అంశాలతో పాటు కార్పొరేషన్ పరిపాలన వ్యవహారాల్లో ప్రజల భాగస్వామ్యం పెంపొందించేందుకు ఎన్నుకోవల్సిన వార్డు కమిటీల ఎన్నికకు మరింత సమయం పట్టేలా ఉంది. ఇందుకు సంబంధించి శనివారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం మరో సారి అర్దాంతరంగా వాయిదా పడింది. కొత్త పాలక మండలి అందుబాటులోకి వచ్చిన తర్వాత జరిగిన సమావేశాలన్నీ కూడా ఇప్పటి వరకు వాయిదాలు పడుతూనే రావటం గమనార్హం. ఈ రకంగా ఎపుడు సమావేశం పెట్టినా, వాయిదా ఎందుకు పడుతోంది? ప్రభుత్వం, జిహెచ్‌ఎంసి పాలక మండలి మధ్య సరైన సయోధ్య, సమన్వయం లేకపోవటమే ఇందుకు కారణమన్న వాదనలున్నాయి. శనివారం ఉదయం ప్రారంభమైన సభకు కొనసాగాలంటే అవసరమైన 108 మంది సభ్యులు హజరుకావల్సిన ఉండగా, సభకు దాదాపు 50 మందిలోపే సభ్యులు హాజరుకావటంతో కోరం లేదంటూ మేయర్ రామ్మోహన్ సమావేశాన్ని వాయిదా వేశారు. 150 డివిజన్లలో జనాభా, ఓటర్లను బట్టి కనిష్ఠంగా ఎనిమిది, గరిష్ఠంగా పనె్నండు మందితో చొప్పున ఏర్పాటు చేయనున్న వార్డు కమిటీల కోసం ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసి అధికారులకు ఇప్పటి సుమారు 4600 దరఖాస్తులు అందినట్లు సమాచారం. అయితే ఇందులో ఎవరెవరికి వార్డు కమిటీల్లో స్థానం కల్పించాలన్న విషయంపై ఇంకా స్పష్టత రాకపోవటం వల్లే కోరం లేదంటూ ఎంతో వ్యూహాత్మకంగా మేయర్ రామ్మోహన్ సభను వాయిదా వేశారు. అంతేగాక, గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ విజయం కోసం శ్రమించిన వారు, తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకపాత్ర పోషించిన డివిజన్ స్థాయి నాయకులకు స్థానం కల్పించాలన్న విషయంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవటం, నిర్ణయం తీసుకునేందుకు మున్సిపల్ మంత్రి కెటిఆర్ అందుబాటులో లేకపోవటం వల్లే కౌన్సిల్ సమావేశం వాయిదా పడిందని చెప్పవచ్చు.
లెక్క తేలలేదా?
నగరంలోని మొత్తం 150 డివిజన్లలో 99 డివిజన్లలో టిఆర్‌ఎస్, మరో 44 డివిజన్లలో మజ్లిస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక్క స్థానంలో టిడిపి కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కౌన్సిల్‌లో ఎక్కువ బలమున్న టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య వార్డు కమిటీలకు సంబంధించి ఈ రెండు పార్టీల మధ్య లెక్క తేలకపోవటం వల్లనే కౌన్సిల్ వాయిదా పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేటర్ చైర్మన్‌గా కొనసాగనున్న ఈ వార్డు కమిటీలకు కార్పొరేటర్ అభిప్రాయానే్న ప్రధాన ప్రామాణికంగా తీసుకుని సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే టిఆర్‌ఎస్ డివిజన్లలో ఎవరెవరికి స్థానం కల్పించాలన్న విషయంపై మున్సిపల్ మంత్రి కెటిఆర్ తుది నిర్ణయం తీసుకోవల్సి ఉన్నందున, ప్రస్తుతం ఆయన అందుబాటులో లేకపోవటం వల్లే కౌన్సిల్ వాయిదా పడిందని చెప్పవచ్చు.