హైదరాబాద్

వీలైనంత త్వరలో వార్డు కమిటీల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: మహానగరాభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించనున్న వార్డు కమిటీలను వీలైనంత త్వరలో నియమిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం కోరం లేక వాయిదా పడినానంతరం ఆయన తన ఛాంబర్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ కోరంకు కావల్సిన సంఖ్యలో సభ్యులు హాజరుకాకపోవటం వల్ల వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వార్డు కమిటీల నియామకంపై ప్రత్యేక సమావేశాన్ని తిరిగి నిర్వహిస్తామని, తేదీని త్వరలోనే మళ్లీ ప్రకటించనున్నట్లు తెలిపారు. అంతేగాక, ప్రస్తుతం వార్డు కమిటీ సభ్యుల పదవీ కాలం అయిదేళ్లు ఉందని, అయితే వీరి పదవీకాలం తగ్గించాలని కొందరు కార్పొరేటర్ల నుంచి సూచనలు, వినతులు వస్తున్నాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. వార్డు కమిటీల్లో సభ్యత్వం కోసం వచ్చిన దరఖాస్తుదారుల జాబితా సిద్ధంగా ఉందని, ఇందులో కొందరు మాజీ ఐఏఎస్ అధికారులు, మరికొందరు సీనియర్ అధికారులు, కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు మేయర్ చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలటం వల్ల వాటిని తొలగించే సహాయక చర్యల్లో కార్పొరేటర్లు బిజీగా ఉన్నందున, వారు ఈ సమావేశానికి హజరుకాలేకపోయారని మేయర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అన్ని దరఖాస్తులను పరిశీలించి, కుల,మత, రాజకీయాలకతీతంగా ఈ వార్డు కమిటీల నియామక ప్రక్రియను పారదర్శకతతో నిర్వహించనున్నట్లు మేయర్ స్పష్టం చేశారు.

జూన్‌లో ఆరోగ్యశ్రీ శిబిరాలు
హైదరాబాద్, మే 28: జిల్లాలో జూన్ 2, 21 తేదీలలో ఆరోగ్యశ్రీ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్‌బోజ్జా తెలిపారు. జూన్ 2న సైదాబాద్ మండలం ఓల్డ్ మలక్‌పేట్‌లోని పద్మానగర్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేయనున్న వైద్య శిబిరంలో గాంధీ, ప్రభుత్వ ఈఎన్‌టి, నియో బిబిసి చిల్డ్రన్స్ ఆసుపత్రి, పుష్పగిరి ఐ ఆసుపత్రి, ఉస్మానియా, కోఠి ప్రభుత్వ మెటర్నిటి ఆసుపత్రుల వైద్య నిపుణులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. జూన్ 21న ముషీరాబాద్ మండలం లోయర్ ట్యాంక్‌బండ్ బండమైసమ్మ నగర్‌లోని కమ్యూనిటి హాల్‌లో జరుగు ఆరోగ్య శిబిరానికి హైదరాబాద్ నర్సింగ్ హోమ్, సికింద్రాబాద్ యశోద, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ చెస్టు ఆసుపత్రి వైద్య నిపుణులు పాల్గొని వైద్య చికిత్సలు అందజేస్తారు. ఆయా మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మెరుగైన చికిత్సలు పొందాలని ఆయన కోరారు.