హైదరాబాద్

1 నుంచి మురికివాడల్లో ‘డిజిటల్ లిటరసీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: భాగ్యనగరంలో త్వరలోనే డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మహానగర పాలక సంస్థ సన్నాహాలు చేస్తోంది. తొలి దశగా వచ్చే నెల 1వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలోని 28 మురికివాడలకు చెందిన పదివేల మందికి ఈ అంశంపై నెలరోజుల పాటు శిక్షణనివ్వనున్నట్లు కమిషనర్ డా. బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. రోజువారి కార్యకలాపాల్లో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా మరింత సులభతరమైన జీవితాన్ని గడిపేందుకు ప్రతి ఒక్కరిలో ఈ ఆన్‌లైన్, ఆధునిక సాంకేతిక సేవల పట్ల అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగానే నగరంలో డిజిటల్ లిటరసీ అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు కాను కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను నగరంలోని వివిధ మురికివాడలకు చెందిన సుమారు పదివేల మందికి తొలి దశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమాన్ని నగరంలోని 28 కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో కేంద్రంలో 200 మందికి శిక్షణనివ్వనున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణ పొందేందుకు గాను 14 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు కలిగి, ఐటి పరిజ్ఞానం, అవగాహన లేని వారై ఉండాలని సూచించారు. ఇందుకు గాను 28 కేంద్రాల్లో శిక్షణనిచ్చే శిక్షకులకు కూడా గ్రేటర్ ఐటి విభాగం అదనపు కమిషనర్ సురేంద్రమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణనిచ్చినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఐటి పట్ల ఎలాంటి అవగాహన లేని వారికి అవగాహన కల్పించేందుకు ఈ క్రింది అంశాలపై శిక్షణనివ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు. బోర్డు నిర్వహణ, గూగుల్ మ్యాప్‌ను గుర్తించటం, ఈ మెయిల్ ఐడిలను క్రియేట్ చేసుకోవటం, ఫొటోలు, కావల్సిన సమాచారాన్ని భద్రపర్చుకునే ప్రక్రియపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే డిజిటల్ లాకర్లను క్రియేట్ చేయటం, ఈ-మెయిల్ చదవటం, రిప్లే పంపడటం, ఆన్‌లైన్‌లో వార్తపత్రికలు చదవటం, రైల్వే సమాచారాన్ని తెల్సుకనేందుకు వీలుగా ఐఆర్‌సిటిసికి రిజిష్టర్ చేసుకోవటం, స్కైప్‌పై పూర్తి అవగాహన కల్పించటం, విక్కీ పిడియా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోర్టల్స్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవటం, ఆధార్ కార్డు నెంబర్ లింకుద్వారా సమాచారం పొందటం వంటి అంశాలను ఈ డిజిటల్ లిటరసీ కార్యక్రమంలో శిక్షణనివ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు.

సకాలంలో విత్తనాలు, ఎరువుల పంపిణీ
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందర్‌రావు
హైదరాబాద్, మే 28: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందేందుకు ముందస్తు ప్రణాళికను రూపొందించేందుకు స్థానిక వ్యవసాయ అధికారులతో ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారులు సమాచారం తెలుసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర