హైదరాబాద్

రూపాయి కొట్టు జీవజలం పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి సరఫరా చేస్తున్న జలమండలి ప్రజల అవసరాల నిమిత్తం స్వచ్ఛమైన నీటిని రూ.1కి అందించేందుకు ఎనీటైమ్ వాటర్ కియోస్క్‌లను పైలట్ ప్రాజెక్ట్ కింద నగరంలోని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్‌లో లీటర్ వాటర్ బాటిల్ రూ.20కు లభిస్తుంటే, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు నీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం కోసం రూపాయికి లీటర్ వాటర్ సౌకర్యాన్ని జలమండలి ప్రారంభించింది. ముందుగా నిమ్స్ ఆసుపత్రి, కెబిఆర్ పార్క్, లుంబినిపార్క్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు జలమండలి ఎండి ఎం.దానకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఖైర్‌తాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎనీటైమ్ వాటర్ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తున్న మూడు ఏజెన్సీల ప్రతినిధులతో ఎండి సమావేశమయ్యారు. ఎనీటైమ్ వాటర్ కియోస్క్‌లు సత్ఫలితాలిస్తే వీటిని నగరంమంతా విస్తరింపజేయడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో జలమండలి ఇడి సత్యనారాయణ, డైరెక్టర్ టెక్నికల్ డాక్టర్ పి.సత్యసూర్యనారాయణ తదితరులున్నారు.