హైదరాబాద్

‘స్వచ్ఛత’వైపు... నగరం అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పారిశుద్ద్యం కార్మికుల వివరాలు ప్రజలకు మరింత సమర్థవంతమైంగా సేవలందిస్తూ నగరం ‘స్వచ్ఛ హైదరాబాద్’ దిశగా అడుగులు వేస్తోందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. జిహెచ్‌ఎంసి ఘన వ్యర్థాల నియంత్రణ విభాగం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను మేయర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో నగరవాసులు భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చెత్తకుప్పల్లేని నగరంగా తీర్చిదిద్దేందుకు, ఓపెన్ గ్యార్బెజి పాయింట్లను రూపుమాపేందుకు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అంతేగాక, నగరంలో ఎక్కడ కూడా బహిరంగ మూత్ర విసర్జన వంటివి చేయకుండా టాయిలెట్లను నిర్మిస్తున్నట్లు, పారిశుద్ధ్య కార్మికుల నిర్వహణను మెరుగుపరిచే కార్యక్రమాలన్నీ కూడా స్వచ్ఛ భారత్ ఆశయాలకు అనుగుణంగా చేపడుతున్నట్లు వివరించారు. ఈ వివరాలన్నీ కూడా ఈ వెబ్‌సైట్‌లో తగు చిత్రాలతో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున వ్యక్తిగత, సముదాయక, పబ్లిక్ టాయిలెట్లను నిర్మించనున్నామని, ఈ టాయిలెట్లు నిర్మించుకునేందుకు ఆసక్తి కల్గిన వారు జిహెచ్‌ఎంసికి దరఖాస్తు చేసుకోవచ్చునని మేయర్ తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్డికి రూ. 12వేల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నామని, ఇందులో రూ. 8వేలు రూపాయలను జిహెచ్‌ఎంసి, మిగిలిన రూ. 4వేలను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను జియో ట్యాగింగ్ ద్వారా పారదర్శకంగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ జియోట్యాగింగ్ ద్వారా టాయిలెంట్ల నిర్మాణంలో ఏ విధమైన అవకతవకలు జరిగే అవకాశం లేదని మేయర్ స్పష్టం చేశారు. రీ కార్యక్రమంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సుధాకర్ పాల్గొన్నారు.