హైదరాబాద్

కుటుంబ కథాచిత్రాలు రావాలి: ఈటల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో శనివారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణను ఘనంగా సత్కరించారు. సభకు అధ్యక్షత వహించిన జస్టిస్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ, కోడి రామకృష్ణతో సాంస్కృతిక సంబంధం వుందని, ఇరువురం నర్సాపురంకు చెందినవాళ్లమని, ఏ ప్రాంతంలో వున్నా సాంస్కృతిక సంస్థలు కళాభిమానులను ఒక చోటుకి చేరుస్తున్నాయని అన్నారు. ఆయన చిత్రాలలో కుటుంబ సామాజిక సంబంధాలతో కూడిన సందేశం వుంటుందని, రాజశేఖర్‌ను హీరోగా నిలబెట్టిన దర్శకుడని, భావితరానికి మార్గదర్శకులని అన్నారు. రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, తెలుగు సంప్రదాయ, సంస్కృతులు ప్రతిబింబించే కార్యక్రమాలు చేసే ఢిల్లీ అకాడమీని అభినందించారు. ఈనాటి తరం జీవితం సార్ధకమయ్యే పనులు చేయాలి. సమాజం అంటే మానవ సంబంధాలు. ఇది ప్రభుత్వ బాధ్యతగా వుండాలి. నేటి సినిమా, టీవీ కార్యక్రమాలు కల్చర్‌ను దెబ్బతీస్తున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను పెంచే సినిమాలు రావాలి. మళ్లీ చరిత్ర తిరగరాసే సినిమాలు, కుటుంబంతో కలిసి చూసే సినిమాలు రావాలని రాజేందర్ అన్నారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ, ప్రతి మనిషికీ తిండి, గుడ్డ, నీడతోపాటు మంచి నాయకుడు కూడా వుండాలి. తెలంగాణ అదృష్టం కెసిఆర్ ముఖ్యమంత్రిగా వుండటం. తనను చందాలతో రైలెక్కించి సినీరంగం కోసం మద్రాస్ పంపిన పాలకొల్లు ప్రజలకు అభినందనలు తెలిపారు. దర్శకుడికి గౌరవం తెచ్చిన దాసరి నారాయణరావు శిష్యుడిగా చేరదీసి తనను దర్శకుడిగా నిలబెట్టారు. తనకు మంచి నిర్మాతలు దొరికినందునే పెద్ద దర్శకుడిని అవగలిగానని అన్నారు. విశ్రాంత ఐఎఎస్ అధికారి జె.బాపురెడ్డి కోడి రామకృష్ణను అభినందించారు. సంఘ సేవకురాలు ఉషారాణి, డా. త్రిపురనేని శ్రీనిలను సత్కరించి పురస్కారాలు ప్రదానం చేసారు. విజయలక్ష్మి, రమణలు సినీగీతాలను ఆలపించారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం డిజైన్ మార్చొద్దు

ఖైరతాబాద్, మే 28: పాలమూరు ఎత్తిపోతల పధకం డిజైన్‌ను మార్చాల్సిన అవసరం లేదని, డిజైన్‌ను మార్చడం వల్ల అక్కడి రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని పాలమూరు రైతులు, గ్రామ అభ్యుదయ సేవా సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శనివారం సోమాజిగూడ ప్రెసెక్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రభుత్వం ఆమోదించిన డిజైన్‌ను చూపారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ రమేష్‌రెడ్డి, గ్రామ అభ్యుదయ సేవాసంస్థ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి డిజైన్‌ను మార్చడం వల్ల ఎదురయ్యే నష్టాలను, సమస్యలను వెల్లడించారు. పేద రైతుల కోసం నిర్మించతలపెట్టిన ఈప్రాజెక్టు ఆదిలో తప్పుదోవ పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్‌లో ఎల్-1 కోడ్ చేసి టెండర్ దక్కించుకున్న నవయుగ సంస్థ అకస్మాత్తుగా డిజైన్‌ను మార్చాలని చూడటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రూ. 3,250 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చడం వల్ల మరో వెయ్యి కోట్లు భారం పడనుందన్నారు. డిజైన్ మార్చే ఉద్దేశం ఉంటే తిరిగి టెండర్ పిలిచి తక్కువ కోట్ చేసే కాంట్రాక్టర్‌చే రైతులకు ఇబ్బంది లేకుండా ప్రాజ్జెను నిర్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయమై ఇరిగేషన్ ఈఈతో పాటు ప్రణాళిక సంఘం చైర్మన్ నిరంజన్ రెడ్డికి కూడా వినతిపత్రం అందించామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అవకాశం ఇస్తే డిజైన్ మార్చడం వల్ల జరిగే నష్టాలను ఆయనకు వివరిస్తామని చెప్పారు.

11న కెఎల్ యూనివర్సిటీ కౌన్సిలింగ్

ఖైరతాబాద్, మే 28: తెలంగాణ రాష్ట్ర విద్యార్ధుల కోసం జూన్ 11న కెఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం విలేఖరుల సమావేశంలో కౌన్సిలింగ్ వివరాలను వెల్లడించారు. 40 వేలలోపు ర్యాంకులు సాధించిన విద్యార్ధులు కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని కోరారు. కేవలం తెలంగాణ విద్యార్థుల కోసమే నిర్వహిస్తున్న ఈ కౌన్సిలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు. రిజర్వేషన్, ఓపెన్ కేటగిరిలో కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. ఉత్తమ ప్రతిభ కనభరిచే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను సైతం అందిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలుగురాష్ట్రాల్లో మొదటి ర్యాంకులో, జాతీయ స్థాయిలో 59వ ర్యాంకులో తమ యూనివర్సిటీ కొనసాగుతోందన్నారు.