హైదరాబాద్

చిరస్మరణీయుడు ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మే 28: ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్టీఆర్ చిరస్మరణీయుడని కొనియాడారు. ఇందులో భాగంగా నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తెదేపా నాయకులు నల్లెల కిశోర్ తదితరులు హాజరయ్యారు. అదే సమయంలో నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు.
ఎన్టీఆర్ ఘాట్‌లో నేతల ఘన నివాళి...
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు జయంతి వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. ఇందులో ఎన్టీఆర్ కుమారులు, మనవలు, నందుమూరి హరిక్రిష్ణ, కళ్యాణ్‌రామ్, తారకరత్న, కుమార్తె భువనేశ్వరి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతితోపాటు పలువురు నగర టిడిపి నాయకులు ఎన్టీఆర్ అభిమానులు ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు.
కీసరలో
కీసర: తెలుగు జాతి కీర్తిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహానుభావుడు దివంగత నందమూరి తారక రామారావు అని మండల టిడిపి అధ్యక్షడు సుంకరి వెంకటేశ్ అన్నారు. శనివారం ఎన్‌టి రామారావు జయంతిని పురస్కరించుకొని టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నాగారం, భోగారం, కీసర, రాంపల్లి, దమ్మాయిగూడ, చీర్యాల గ్రామాలలో ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వెంకటేశ్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్‌టిఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి బి. రమాదేవి, ఎంపిటిసిలు శ్రీహరిగౌడ్, భాస్కర్‌గౌడ్, వనితా బాల్‌రెడ్డి, నాయకులు ఎ. శ్రీనివాస్, జంగయ్యయాదవ్, డి. నర్సింహరెడ్డి, బి. మల్లేశ్‌యాదవ్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శప్రాయుడు ఎన్టీఆర్
ఇబ్రహీంపట్నం: తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఆదర్శప్రాయుడు ఎన్టీఆర్ అని జడ్పీటిసి పొట్టి అయిలయ్య, తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు మోరుూజ్‌పాష పేర్కొన్నారు. ఎన్టీఆర్ 92వ జయంతిని పురస్కరించుకొని తెదేపా శ్రేణులు స్థానిక చెరువుకట్టపైనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదు, బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువ చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రూపుమాపి స్థానిక సంస్థలను తీసుకొచ్చి ప్రజలకు సుపరిపాలన అందించారని శ్లాఘించారు. పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి తెదేపా కార్యకర్త నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు ఇందూరి శ్రీనివాస్, కప్పరి లక్ష్మయ్య, కప్పరి అంజయ్య, జక్క రాంరెడ్డి, కప్పరి రాజు పాల్గొన్నారు.
టిడిపికి పూర్వవైభవం తీసుకొస్తాం
ఉప్పల్: రామంతాపూర్‌లో టిడిపికి పూర్వవైభవం తీసుకొస్తామని పార్టీ సీనియర్ నాయకుడు లింగాల దశరథ్‌గౌడ్ అన్నారు. శనివారం పాతబస్తీలోని మున్సిపల్ వార్డు కార్యాలయం వద్ద నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్‌చేసి కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. టిడిపి హయాంలోనే రామంతాపూర్ అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో హామీలే తప్ప అభివృద్ధి ఎక్కడా కన్పించడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ వ్యితిరేక విధానాలను ప్రజల్లోకి తీసికెళ్లి రానున్న రోజుల్లో టిడిపికి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు సర్వ సత్తయ్యయాదవ్, బుర్ర మహేందర్, ఈశ్వర్, లక్ష్మణ్, ఆదినారాయణగౌడ్, గిరిబాబు, చంద్రం, బుర్ర నర్సింహ, రమేశ్, మధుసూదన్‌రెడ్డి, సురేష్ ముదిరాజ్, పాల్గొన్నారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో వందలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎన్‌టిఆర్ సేవలు చిరస్మరణీయం
నేరేడ్‌మెట్: తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన ఘనత నందమూరి తారకరామరావుదేనని రంగారెడ్డి జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు మండల రాధాకృష్ణయాదవ్ పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ జయంతి సంధర్భంగా శనివారం సఫిల్‌గూడ చౌరస్తాలోని ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు పడుతున్న కష్టాలు చూసి తెలుగుదేశం స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్‌టిఆర్‌దే అన్నారు. పేదలకోసం రెండు రూపాయలకు కిలో బియ్యం, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల బతుకులలో వెలుగులు నింపారని తెలిపారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు అయన ఆశయసాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బివికె రావు, రాంచందర్, నాగరాజు, మంగేష్, రజాక్, పిట్ల నందు, శ్రీనివాస్‌యాదవ్, నరేందర్, శేఖర్, బండారు రవి, షఫి, శ్రీను, వాసుదేవరావు, చారి, విజయలక్ష్మీ, నీలమ్మ పాల్గొన్నారు.
ఘట్‌కేసర్‌లో
ఘట్‌కేసర్: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని ఘట్‌కేసర్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ఆవరణలో ఎన్‌టిఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తెలుగుప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్‌టిఆర్ అని మండల టిడిపి అధ్యక్షుడు దేశగోని రఘుపతిగౌడ్ అన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతితో పాటు రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన ఎన్‌టిఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఎస్‌టి సెల్ అధ్యక్షుడు నానావత్ రూప్‌సింగ్‌నాయక్, మండల టిడిపి అధికార ప్రతినిధి వేముల సంజీవగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ సేవలు మరువలేనివి
మేడ్చల్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సేవలు మరువలేనివని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ 94వ జయంతి వేడుకలను శనివారం మేడ్చల్ మండలంలో టిడిపి ప్రజాప్రతినిధులు, నాయకులు అట్టహాసంగా జరుపుకున్నారు. కండ్లకోయ గ్రామంలో సర్పంచ్ కందాడి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ రాష్ట్రానికి పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలకు చాటిచెప్పిన ధీశాలి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. సామాన్యుడికి సైతం రాజకీయం తెలిసే విధంగా సంస్కరణలు చేపట్టి అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం పరితపించేవారని నాయకులు గుర్తు చేశారు. ఎంతోమంది నాయకులకు రాజకీయంగా అవకాశాలు కల్పించి వారికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చారని చెప్పారు. మహిళలకు, పురుషులకు సమానంగా ఆస్తి హక్కు, రాజకీయంగా రిజర్వేషన్‌లు కలిపించిన ఘనత ఎన్టీఆర్‌దేనని వివరించారు. ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ ఆయన స్ఫూర్తిగా ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో, అత్వెల్లిలో తదితర గ్రామాల్లో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటిసి శైలజ, పట్టణ అధ్యక్షుడు మర్రి నర్సింహ్మరెడ్డి, భాగ్యరెడ్డి, రవీందర్‌రెడ్డి, స్వామి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లిలో..
ఎన్టీఆర్ జయంతిని గుండ్లపోంపల్లిలో నాయకులు ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గల ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు మల్లికార్జున్, మహిపాల్‌రెడ్డి, రాముయాదవ్, సందీప్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రాజు, నదీమ్, గోపాల్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
కాగా,టిడిపికి కంచుకోట అయిన గుండ్లపోచంపల్లిలో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు, వార్డు సభ్యులు, నాయకులు మల్కాజ్‌గిరి ఎంపి వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ శ్రేణులను ఏమాత్రం ఖాతరు చేయడంలేదని అసలు పార్టీ క్యాడర్‌ను పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపించారు. ఆయన తీరు నచ్చకపోవడంతో శనివారం ఎన్టీఆర్ జయంతికి శ్రేణులు దూరంగా ఉన్నారు. ఎంపి నిధుల విషయమై మరే ఇతర విషయమై ఆయన వద్దకు వెళ్లినా నాకు పార్టీతో, పార్టీ శ్రేణులతో ఏమాత్రం సంబంధం లేదంటూ అసహనం వ్యక్తం చేయడంతో నాయకులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైనట్లు తెలిసింది. ఎంపి తీరు మార్చుకోకపోతే పార్టీకి తీరని నష్టం తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే డీలాపడ్డ టిడిపికి అన్ని తానై ముందుకు తీసుకెళ్లాల్సిన ఎంపి మల్లారెడ్డి దురుసుగా వ్యవహరించడం తగదని అందరిని కలుపుకుని పోవాలని పలువురు సూచిస్తున్నారు.